పులి అంటే ఎవరికైనా భయమే.దాన్ని నేరుగా చూడాలి అంటే ధైర్యం సరిపోదు.
ఒకవేళ నేరుగా చూడాలన్న కూడా జూపార్క్ బోనులలో మాత్రమే చూడగలం.అంతే కానీ దాని దగ్గరికి వెళ్లి దాని పట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయలేము.
ఎక్కడో కొందరు పెంపుడు జంతువుగా పులిని, సింహాలను పెంచుకుంటూ ఉంటారు.
కొంత వరకు వాటి ద్వారా స్నేహం చేయవచ్చు.
కానీ అడవుల్లో ఉండే పులులు, సింహాలతో మాత్రం అంత సాహసం చేయలేము.తాజాగా మరో తెలుగు హీరోయిన్ ఏకంగా పులి బోను లోకి వెళ్లి దాంతో గేమ్స్ ఆడుతూ అందరికీ షాక్ ఇచ్చింది.
పైగా తాను పులితో ఆడుతున్న ఫోటోలు, వీడియోల కూడా పంచుకుంది.ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అంటే.
అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి అనన్య నాగల్ల.తెలంగాణ భాషతో అతి తక్కువ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాలలో నిలిచింది ఈ తెలుగు అమ్మాయి.
తన అందం వలలో యువతను కట్టిపడేసి వారి మదిలో గుడి కట్టేసుకుంది.

మొదట ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనన్య.ఈ సినిమాలో మల్లేశం భార్యగా పల్లెటూరి అమ్మాయిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో అనన్య కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.
ఇండస్ట్రీకి ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.ఇక ప్లే బ్యాక్ సిరీస్ తో కూడా మంచి గుర్తింపు అందుకుంది.
ఇక వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో బాగా పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.ఇక ఈ అమ్మడు నడుము అందాలతో మాత్రం యువతను కన్నార్పకుండా చేస్తుంది.దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకున్నా కూడా.
ఒక రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుంది అని తెలిసింది.ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా చాలా పెద్ద ధైర్యం చేసింది.ఏకంగా పులి బోనులోకి వెళ్లి దానితో గేమ్స్ ఆడుతూ ఫోటోలు కూడా దిగింది.
ఇక దానికి సంబంధించిన వీడియో కూడా షేర్ చేసుకోగా.ప్రస్తుతం అది బాగా వైరల్ గా మారింది.
ఆ వీడియో చూసిన నెటిజనులు తాను చేసిన ధైర్యానికి సలాం కొడుతున్నారు.







