సాధారణంగా సినిమాలలో కొన్ని కష్టమైన సన్నివేశాలను హీరోలు గ్రాపిక్స్, సెట్టింగ్స్ ద్వారా చేస్తూ ఉంటారు.అయితే ఇంకొందరు హీరోలు అయితే రియల్ స్టంట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.
అటువంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పవచ్చు.అదేవిధంగా కొంతమంది నటులు సినిమాలలోని కొన్ని క్యారెక్టర్ లలో ఒదిగి పోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు.
అటువంటి వారిలో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ కూడా ఒకరు.ఇతను తాజాగా నటించిన బెంగాలీ చిత్రం మృత్యుపతోజాత్రి ( ఎవరు చనిపోతారో).
సౌమ్య సేన్ గుప్తా దర్శకత్వం వహించారు.
ఇందులో రాహుల్ మరణశిక్ష పడిన ఖైదీల పాత్రల్లో నటించారు.
ఇక చనిపోవడానికి 12 గంటల ముందు ఖైదీల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ సినిమాలో చూపించారు.అయితే ఇందుకోసం రాహుల్ షూటింగ్‌కు ముందు సుమారు 15 రోజులు పాటు ఎవరితోను మాట్లాడలేదట.
కనీసం వారి ఇంటిసభ్యులతో కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నాడట.నిజానికి మనం ఎప్పుడూ చనిపోతామో ఎవరికీ తెలియదు.
కానీ సినిమాలో తన జీవితం 12 గంటల తర్వాత ముగుస్తుందని తెలుసు.దానిని అర్థం చేసుకోవడమే కష్టం.
అయితే అతనికి తెలుసు ఆ మరణంలో ఎలాంటి గౌరవం ఉండదని.అంతే కాకుండా ఆ సమయంలో అతనికి మద్దతుగా కూడా ఎవరు నిలబడరు.

ఈ సినిమా చిత్రీకరణకు 15 రోజులు ముందు నుంచే తన ఇంట్లోవాళ్లతో మాట్లాడటం మానేశాడట.అలాగే డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా చాలా బాగా రీసెర్చ్ చేశారని చాలా స్టడీ మెటీరియల్స్ ఇచ్చారని చెప్పుకొచ్చారు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ.ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం.ఇది కల్పితమైనప్పటికీ నిజ జీవితంలో ఖైదీల గురించి కొన్ని పుస్తకాలు, న్యాయవాదులు, పోలీసులతో జరిగిన చర్చల ఆధారంగా స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడంలో ఉపయోగపడ్డాయి.
ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి 12 గంటలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను అని తెలిపారు డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా.







