యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఆగష్టు నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని వార్తలు ప్రచారంలోకి ఉండగా అధికారికంగా చిత్రయూనిట్ నుంచి షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివకు కొత్త కండీషన్ పెట్టారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.
ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రిజల్ట్ విషయంలో తారక్ అభిమానులు సైతం ఒకింత టెన్షన్ పడుతున్నారు.
ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా పాన్ ఇండియా మూవీగా హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎన్టీఆర్ మళ్లీ మాస్ రోల్ లో నటిస్తుండటంతో తారక్ అభిమానులు సైతం తెగ సంతోషిస్తున్నారు.సోషల్ మీడియాకు కొరటాల శివ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు.
అయితే కొరటాల శివ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ సైతం కొరటాల శివ సోషల్ మీడియాలో కచ్చితంగా యాక్టివ్ గా ఉండాలని షరతు పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ కండీషన్ కు కొరటాల శివ అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్30 మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.