త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే ఊద‌లు ఆరోగ్యానికి ఎన్ని లాభాల‌ను అందిస్తాయో తెలుసా?

ఊద‌లు.వీటి గురించి వినే ఉంటారు.అద్భుత‌మైన సిరి ధాన్యాల్లో ఇవి ఒక‌టి.పైగా ఊద‌ల ధ‌ర చాలా త‌క్కువ‌.అయిన‌ప్ప‌టికీ ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌కాలు ఊద‌ల్లో నిండి ఉంటాయి.అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక లాభాల‌ను చేకూరుస్తాయి.

 Wonderful Health Benefits Of Barnyard Millet! Health, Benefits Of Barnyard Mille-TeluguStop.com

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఊద‌ల‌ను ఎలా తీసుకోవాలి.? అస‌లు ఊద‌ల వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

ఊద‌ల‌తో ఉప్మా, ఇడ్లీ, కిచిడీ, ఫ్రైడ్ రైస్, దోసె, పాయ‌సం ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు.

ఎలా తీసుకున్నా అవి మ‌న ఆరోగ్యానికి మేలే చేస్తాయి.సాధార‌ణంగా మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు వైట్ రైస్‌ తింటే చ‌క్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి.అందుకే వైట్ రైస్ కు ప్రత్యామ్నాయాల‌ను వెతుకుతుంటారు.అయితే వైట్ రైస్ కు ప్రత్యామ్నాయంగా ఊద‌ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

ఊద‌ల‌ను తీసుకుంటే బ్లెడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయ‌ని పోష‌కాహార‌ నిపుణులు చెబుతున్నారు.

బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారికి ఊద‌లు ఓ మంచి ఆహారంగా చెప్పుకోవ‌చ్చు.

ఊద‌ల్లో కేలరీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి.అందువ‌ల్ల‌, వీటిని డైట్‌లో చేర్చుకుంటే సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఊద‌ల్లో ఐర‌న్ కంటెంట్ పుష్క‌లంగా నిండి ఉంటుంది.వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌కుండా ఉంటారు.

Telugu Barnyard Millet, Tips, Latest, Millet, Udalu-Telugu Health Tips

అంతే కాదు, ఊద‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది.లివ‌ర్ క్యాన్స‌ర్‌, గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.కాలేయం, మూత్రాశ‌యం శుభ్రం అవుతాయి.అతి ఆక‌లి దూరం అవుతుంది.మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం చురుగ్గా మారుతుంది.కాబ‌ట్టి, త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే ఊద‌ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం అస్స‌లు మ‌ర‌చిపోవ‌ద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube