తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున చిత్రబృందం బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే విరాటపర్వం డైరెక్టర్స్ వేణు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, హీరో నవీన్ చంద్ర, సాయిపల్లవి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి వచ్చారు.
ఇక ఈ కార్యక్రమానికి సాయి పల్లవి ఎంట్రీ కాగానే సుమను చూసి అదేంటి ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు అని సాయి పల్లవి అనగా సుమ ఎక్కడ చూసినా తానే ఉంటానని పెద్ద డైలాగ్ చెప్పారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమోలో భాగంగా చిత్ర బృందంతో సుమ ఎప్పటిలాగే ఆడిస్తూ వారి చేత డాన్సులు చేయిస్తూ సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోటో స్క్రీన్ పై రాగానే సాయి పల్లవి తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరో అనే భావన తనలో ఏ మాత్రం కనిపించదు.

తనకు మనసులో ఏది అనిపిస్తే దానిని బయట పెట్టేస్తారు.లోపల ఒకటి బయట ఒకటి పవన్ కళ్యాణ్ మాట్లాడరని అందుకే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా సాయి పల్లవి తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని తెలియజేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే విరాట పర్వం సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే ఈ సినిమాలో సాయి పల్లవి రానా జంటగా నటించగా నవీన్ చంద్ర, ప్రియమణి వంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.







