మా ఆయన రాముడు.. వాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తరచూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

 Jabardasth Latest Promo Funny Skit On Anasuya Bharadwaj Details, Jabardasth, An-TeluguStop.com

ఈ క్రమంలోనే అనసూయ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్స్, కామెంట్స్ చేసినా ఆమెకు ఎప్పుడూ అండగా నిలుస్తూ తోడుగా ఉంటున్నారు ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్‌. అనసూయ పై ఎంతమంది ఎన్ని విధాలుగా నెగిటివ్ గా కామెంట్స్ చేసిన కూడా పట్టించుకోరు.

అనసూయ కూడా ఇప్పటికే తన భర్త సుశాంక్ భరద్వాజ్ పై తనకున్న ప్రేమను వ్యక్త పరిచిన విషయం తెలిసిందే.ఇక కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సమయం దొరికినప్పుడల్లా తన భర్త భరద్వాజ్ తో కలసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

అందుకు సంబందించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక ఆ ఫోటోలు వీడియోలతో వారి మధ్య ఉన్న అన్యోన్యత గురించి చెప్పకనే చెప్పేస్తూ ఉంటుంది.

ఇటీవల బీచ్‌లో తన భర్తకి లిప్ లాక్ ఇస్తూ అందుకు సంబందించిన ఫోటోలను షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే జబర్దస్త్ షోలో ప్రతివారం హంగామా చేసే అనసూయ.

తాజాగా ప్రోమోలో కొత్త కొత్త క్యాస్ట్యూమ్స్‌ తో మెరిసే అనసూయ తాజాగా విడుదల అయిన ప్రోమో లో కూడా ఒక డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్‌తో సంథింగ్ డిఫరెంట్ అనే లుక్‌లో సర్ ప్రైజ్ చేసింది.తలకి కట్టుకుట్టుని లాంగ్ ఫ్రాంక్‌లో జిగేల్ అనిపించింది అనసూయ.

ఆమె గెటప్ చాలా విచిత్రంగా ఉంది.ఇక దొరబాబు,పరదేశి లు స్కిట్‌లో అయితే అనసూయతో పాటు ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్‌ ను కూడా వాడేశారు.

సెలబ్రిటీ హోమ్ టూర్ కాన్సెప్ట్‌లో భాగంగా అనసూయ ఇంటిపై హోమ్ టూర్ చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై పొట్టచెక్కలయ్యే స్కిట్ చేశారు.

ఇందులో అనసూయ, ఆమె భర్తను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు జబర్దస్త్ కమెడియన్లు.సూయ సూయ అనసూయ అనే పాటకి నైటీ వేసుకుని అనసూయలా ఎంట్రీ ఇచ్చాడు రైజింగ్ రాజు. అతన్ని చూడగానే అనసూయకి గుండె ముక్కలైనంత పని అయ్యింది.

ఈ కర్మ ఏంట్రా బాబూ అన్నట్టుగా తల కిందికి పెట్టేసుకుంది.ఇక తరచూ అనసూయ ఫేస్ బుక్‌లో నెటిజన్లతో ఏదో ఒక విషయంపై గొడవపెట్టుకుంటూ ఫైర్ అవుతూ ఉండగా.

దానిపై కూడా సెటైర్లు పడ్డాయి.మేం యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము హోం టూర్ కోసం వచ్చాం అని పరదేశి అనగా,అనసూయ పాత్రలో ఉన్న రైజింగ్ రాజు.

నాన్సెన్స్.గెటౌట్ అని అనగా అప్పుడు పరదేశి అంత కోప్పడకండి.

ఇది ఫేస్ బుక్ కాదు యూట్యూబ్ అంటూ అనసూయ గాలి తీసేస్తాడు.

ఆ తరువాత స్కిట్ అనసూయ భర్తపైకి ఫిష్ట్ అయ్యింది.అనసూయ భర్తగా చేయి ఊపుకుంటూ వస్తాడు దొరబాబు.అతన్ని చూడగానే అనసూయ తల పట్టుకుంటుంది.ఇక జడ్జీగా ఉన్న ఇంద్రజ.అయ్యయ్యో అనసూయ అని అనగానే.అనసూయ ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యింది.‘రాముడు లాంటి మా ఆయనకి దొరబాబుని పెట్టారా’.

ఇది ఆపకపోతే వయెలెంట్ అవుతుంది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది అనసూయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube