పదేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ అయ్యా.. రానా కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 Rana Sensational Comments On Pan India Star,rana Daggubati,sai Pallavi,virata Pa-TeluguStop.com

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు దగ్గర పడటంతో చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఇందులో రానా నక్సలిజం నాయకుడిగా అందరిని చైతన్యపరచడం కోసం స్వయంగా ఒక పాట పాడారు.ఈ పాట పాడేటప్పుడు ఎమోషన్ తట్టుకోలేకపోయానని వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ నేను గత పది సంవత్సరాల క్రితమే ఈ పాన్ లోనే ఆమ్లెట్లు వేసుకుంటున్నాను(నవ్వుతూ)అని తెలిపారు.

ఇక విరాట పర్వం సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించక పోవడానికి కారణాన్ని కూడా ఈ సందర్భంగా రానా తెలియజేశారు.ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మాకు అసలు పాన్ ఇండియా చేయాలనే ఆలోచన కూడా రాలేదని తెలిపారు.

Telugu Pan India, Rana, Rana Daggubati, Rana Interview, Sai Pallavi, Tollywood,

కొన్ని కథలను తెలుగులోనే చేయాలి.విరాట పర్వం సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినది ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన కథ.ఆ ప్రాంతం తాలూకు సాహిత్యం ఎక్కువగా వుంది. దర్శకుడు వేణు ఉడుగుల స్వతహాగా సాహిత్యకారుడు.

 సాహిత్యం మరొక భాషలో కుదరక పోవచ్చు అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేయాలనే ఆలోచన రాలేదని ఈ సందర్భంగా విరాట పర్వం సినిమా గురించి తెలిపారు.అయితే ఈ సినిమాని బెంగాలీ హిందీ మలయాళంలో డబ్ చేస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube