ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఖరీదైన కారు గిఫ్ట్‌గా పొందాడు!

ఇటీవల కాలంలో రోడ్డుపై ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో పడి ఉంటే సాయం చేయడాన్ని అంతా మరిచిపోతున్నారు.తమ చేతిలోని ఫోన్లను ఆన్ చేసి వీడియోలు రికార్డ్ చేస్తున్నారు.

 Man Who Saved Man On Train Tracks Gets Free Car , Audi A8,chicago,subway Tracks,-TeluguStop.com

ఓ వ్యక్తి ప్రాణం పోతున్నా, తమకు వీడియోలు తీయడమే ముఖ్యమని భావిస్తున్నారు.వాటిని సోషల్ మీడియాలో పెట్టి, వాటికి వచ్చే లైకులు, కామెంట్లు చూసి సంతోషిస్తున్నారు.

అయితే అందరూ అలా ఉండరని తాజా ఘటన రుజువు చేస్తోంది.ఓ యువకుడు తన ప్రాణాలకు తెగించి మరో వ్యక్తిని కాపాడాడు.

చుట్టూ ఎంత మంది హెచ్చరిస్తున్నా, ముందుకు వెళ్లి సాహసం చేశాడు.దీంతో ఒక్కసారిగా అతడు ఫేమస్ అయ్యాడు.

అతడి సాహసాన్ని గుర్తించిన ఓ ప్రముఖ వ్యాపారి అతడికి ఖరీదైన కారును గిఫ్ట్‌గా అందించాడు.ఈ ఆసక్తికర అంశానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Anthony Perry, Audi, Chicago, Subway, Latest-Latest News - Telugu

అమెరికాలోని చికాగో రాష్ట్రంలో ఓ చోట టోనీ పెర్రీ అనే 20 ఏళ్ల యువకుడు ఎప్పట్లానే ఇటీవల తన ఉద్యోగానికి బయల్దేరాడు.ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌కు రాగానే ఓ వ్యక్తి ప్రమాదకరంగా పట్టాలపై పడి ఉండడం చూశాడు.అతడి శరీరం గుండా 600 వోల్టుల కరెంట్‌ను పంపుతున్న ఎలక్ట్రికల్ ట్రాక్‌లపై ఇరుక్కుపోయాడని గమనించాడు.ఎవరూ అతడిని తాక వద్దని చుట్టు పక్కల వాళ్లు ఒకరికొకరు హెచ్చరిస్తున్నారు.

ఈ తరుణంలో ఆ హెచ్చరికలకు టోనీ పెర్రీ పట్టించుకోలేదు.తానేమీ సూపర్ హీరో కాకపోయినా, ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి పెద్ద సాహసమే చేశాడు.

వెంటనే ప్లాట్‌ఫారం మీద నుంచి కిందికి దూకాడు.పట్టాలపై ఉన్న వ్యక్తిని జాగ్రత్తగా పట్టుకుని ప్లాట్‌ఫారం మీదకు చేర్చాడు.

ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కరెంట్ షాక్‌కు గురయ్యే వాడు.తద్వారా తన ప్రాణాలను కోల్పోయేవాడు.

వీటిని లెక్క చేయకుండా తన ప్రాణాలకు తెగించి మరో వ్యక్తి ప్రాణాన్ని టోనీ కాపాడాడు.ఈ ఘటనను అక్కడే నిలుచుకున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

నెట్టింట ఇది బాగా వైరల్ అయింది.స్థానిక వ్యాపారి ఒకరు దీనిని చూశారు.టోనీ సాహసానికి మెచ్చి, రూ.60 లక్షలకు పైగా ధర ఉన్న ఆడి 8 కారును టోనీకి బహుమతిగా పంపించాడు.ఇది చూసిన టోనీ ఆనందానికి అవధులు లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube