నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఇప్పుడు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.
తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి.
అక్కడ మంచి టాక్ రావడంతో నాని ఖాతాలో మరొక సూపర్ హిట్ సినిమా పడనుందని అనిపిస్తుంది.ఈ సినిమాలో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించింది.
ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే సినిమా నాని నుండి మరొకటి రాబోతుంది.ఈ సినిమాలో కూడా నాని డిఫెరెంట్ పాత్రలో నటించాడు.
నాని నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ తో మంచి అనుబంధం ఉండడంతో సుకుమార్ నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ వేదికపై సుకుమార్ పలు విషయాల గురించి చెప్పుకొచ్చాడు.ఈ సినిమాను మా నిర్మాతలు సరదాగా చూడమని చెప్పడంతో చూశానని ఈ సినిమా అంత ఆనందాన్ని, ఎంజాయ్ మెంట్ ను తట్టుకోలేక పోయానని బయటకు వచ్చిన తర్వాత నా ఈగో అంతా పక్కన పెట్టి ఆత్రేయను గట్టిగా హగ్ చేసుకున్నాను.
సినిమా అద్భుతంగా వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ వేడుకకు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేసారు.ఈయన గురించి కూడా సుకుమార్ కామెంట్స్ చేసారు.పవన్ గారిని నేని ఆర్య సినిమా తర్వాత కలిసాను ఆయనకి కథ చెప్పడానికి వెళ్లి కూడా చెప్పలేక పోయాను.
ఆ తర్వాత భీమ్లా నాయక్ షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు కాస్త ఆయాస పడుతున్నట్టుగా అనిపించింది.అది పవన్ కళ్యాణ్ గారు గ్రహించి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండమని త్రివిక్రమ్ తో చెప్పించారట.
నేను ఆయాస పడింది ఆయనను చూశాననే ఆనందంతో అని ఆయన చెప్పుకొచ్చాడు.







