ఏంటి ఖంగు తిన్నారా? మీరు విన్నది నిజమే.ఆమె ఒక్కతే వరుడు లేకుండానే ఒంటరిగా హనీమూన్ కి వెళ్తోంది.
మరి పాట్నర్ లేకుండా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఆమెకి ఆమెయే లైఫ్ పాట్నర్.అవును.
గుజరాత్‌కు చెందిన క్షమా బిందు అనే యువతి వివాహం గత కొన్ని రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌గా మారింది.ఎందుకంటే క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఈ క్రమంలో తనను తానే పెళ్లి చేసుకోవడం హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకమంటూ BJPకి చెందిన ఓ నాయకుడు స్టేట్‌మెంట్ ఇవ్వడం పెను సంచలనంగా మారింది.
ఆ తర్వాత ఇతర పార్టీలు కూడా క్షమా బిందు వివాహం విషయంలో స్పందించాయి.దాంతో తన వివాహం వివాదాలకు కేంద్రంగా మారుతోందని గ్రహించిన క్షమా బిందు, అనుకున్న సమయం కంటే ముందుగానే పెళ్లి వేడుకను పూర్తి చేసి ఇంకోసారి అందరికీ షాక్ ఇచ్చింది.
హిందూ సాంప్రదాయం ప్రకారం మెహిందీ, హల్దీ వేడుకలను నిర్వహించి మరీ తనను తాను ఘనంగా పెళ్లి చేసుకుంది.ఆ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

“నా నిర్ణయానికి మద్దతు ఇచ్చి, నాకు విషెష్ తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.సెల్ఫ్ మ్యారేజ్ అంటే షరతులు లేకుండా మనల్ని మనం ప్రేమించుకోవడమే.నీకు నువ్వు భరోసాగా నిలబడడమే.నిజానికి ప్రజలందరూ తాము ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు.ఇక్కడ నాకు నేనంటే చాలా ఇష్టం.అందుకే నన్ను నేను పెళ్లి చేసుకున్నాను” అని బిందు తెలిపింది.
పెళ్లి తంతు ముగిసింది కనుక ఒంటరిగానే హనీమూన్‌కు కూడా వెళుతున్నట్టు పేర్కొంది.
.






