తెలుగు సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.
కేవలం వెండితెరపై కాకుండా బుల్లితెరపై కూడా తానేమిటో నిరూపించుకుంది.ఇక ఇందులోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా రోజా ఫైర్ బ్రాండ్ గా మారింది.
ఇక ఇటీవలే ఈమెకు మంత్రి పదవి రావటంతో పూర్తిగా సినీ ఇండస్ట్రీ దూరం పెట్టింది.దీంతో ఇప్పుడు రాజకీయపరంగా బాగా బిజీగా ఉంది.
ఆమె ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.ఇదిలా ఉంటే తన నియోజకవర్గ నగరి ఎన్నికల్లో ఈసారి రోజా ఓడిపోనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
కారణమేంటంటే.తన సొంత నియోజకవర్గంలో రోజాకు గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది.ప్రస్తుతం నగరి నియోజక రాజకీయాలు ఓ రేంజ్ లో చెలరేగుతున్నాయి.ఇక అక్కడ పోటీ చేయడానికి ఒక సెలబ్రిటీ తో పాటు మరో రాజకీయ ఫ్యామిలీ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది చంద్రబాబుకు అర్థం కాని పరిస్థితిగా మారింది.ఇదివరకు రోజా టీడీపీ పార్టీలో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
కానీ అందులో తనకు సీటు రాకపోవడంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది.దీంతో రోజాకు ప్రస్తుతం ఈ పార్టీ తరపున మంత్రి పదవి కూడా అందింది.
గత రెండు ఎన్నికల్లో రోజా నగరి నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చింది.

ఇప్పుడు మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో.చంద్రబాబు ఆమెను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.అందుకే ఇప్పుడు ఆయన ఆ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అని ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.
ఇంతకూ ఆ నియోజకవర్గానికి పోటీ పడడానికి వచ్చిన సెలబ్రిటీ ఎవరో కాదు ప్రముఖ నటి వాణి విశ్వనాథ్.ఈమె గత నాలుగేళ్ల కిందటే తెలుగుదేశం పార్టీలో చేరింది.
ఇప్పుడు ఈమె నగరి నియోజకవర్గం లో రోజా పై గట్టి పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది.వచ్చే ఎన్నికల్లో రోజా పై పోటీ చేసి తప్పకుండా గెలుస్తాను అని ధైర్యంగా తెలుపుతుంది.
నగరిలో తమిళ సంస్కృతి ఉంది అని ఇక్కడే పోటీ చేస్తాను అని తెలిపింది.ఈమెతో పాటు మరో రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం కూడా అక్కడ టికెట్ కోసం పోరాడుతున్నట్లు తెలుస్తుంది.
మొత్తానికి ఈ పోటీ అక్కడ బాగా వేడి మీద ఉందని చెప్పవచ్చు.ఒకవేళ చంద్రబాబు వాణి విశ్వనాథ్ టికెట్టు ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం రోజా కు గట్టి పోటీ తప్పదని చెప్పాలి.
కొన్ని పరిస్థితులను చూసినట్లయితే చంద్రబాబు గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారులకు ప్రయారిటీ ఇస్తున్నట్లు అర్థమవుతుంది.ఇక మొత్తానికి చంద్రబాబు రోజాపై టార్గెట్ చేయటంతో వీరిద్దరిలో ఎవరికి ఇస్తారు అనేది మాత్రం బాగా ఆసక్తిగా మారింది.







