మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.
హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.అలాగే రెమ్యునరేషన్ పెంచినా కూడా ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.ఈ సినిమాను జులై 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.
కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు మేకర్స్.ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా ఆలస్యం అవడానికి రవితేజ కూడా కారణమట.ఈ సినిమా ఎలాగూ వాయిదా పడింది.దీంతో కొన్ని సన్నివేశాలు అనుకున్న విధంగా రాకపోవడం వల్ల రిలీజ్ కు ఇంకా టైం ఉండడంతో రవితేజ ను మరొక వారం పాటు రీషూట్ కోసం పిలిచారట.
ఆయన వచ్చి సీన్స్ లో అయితే నటించాడు./br>

కానీ ఆ సీన్ లను చూడకుండానే తన తర్వాత సినిమా షూటింగ్ కోసం చెప్పకుండానే వెళ్లిపోయారని రవితేజ ఫైనల్ కాల్ కోసం ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎదురు చూస్తున్నాడని తెలుస్తుంది.ఈయన వేరే సినిమాకు వెళ్తే మళ్ళీ లుక్ లో చేంజ్ వస్తుంది మరో అవకాశం కూడా ఉండదు కాబట్టి ఈ లోపే రవితేజ కాల్ కోసం ఎదురు చూస్తున్నారట.మరి ఈ సినిమా రిలీజ్ ఈయన ఫైనల్ కాల్ పై ఆధారపడిందని డైరెక్టర్ వైట్ చేస్తున్నారట.







