నాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.
ఇదివరకే ఈమె రాజా రాణి డబ్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యే తన అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తూ మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈమె మాట్లాడుతూ తాను అంటే సుందరానికి సినిమాలో నటించడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని కూడా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కథల ఎంపిక విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటానని కొందరు మాత్రం నేను రోజు కథలు వింటూ రిజెక్ట్ చేస్తూ ఉంటానని భావిస్తుంటారు.అందులో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.
ఇకపోతే అంటే సుందరానికి సినిమా కథ వింటున్న సమయంలో నాలో ఏదో ఎగ్జైట్మెంట్ కలిగి ఉందని తెలిపారు.

ఈ సినిమా కథ వినే సమయంలో భాషతో సంబంధం లేకుండా ఒక సగటు ప్రేక్షకుడిగా ఈ సినిమా కథ విన్నాను. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్.ఇలా అన్నీ భావోద్వేగాలు ఒక కథలో కుదరడం చాలా అరుదు.
ఈ కథ వినగానే ఎంతో అద్భుతం అనిపించింది అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని ఈ సందర్భంగా నజ్రియా తెలిపారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.







