టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో మహేష్ బాబు నమ్రత జోడీ ఒకటి కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ నమ్రత ఫ్యామిలీకు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయిస్తున్నారు.తాజాగా నమ్రత మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మహేష్ కు ఖాళీ సమయం దొరికితే సరదాగా టూర్స్ వేస్తుంటామని షాపింగ్ లు చేస్తుంటామని ఆమె చెప్పుకొచ్చారు.మాకు నచ్చింది తింటామని ఆమె తెలిపారు.
అయితే మహేష్ బాబును వెంటేసుకుని షాపింగ్ చేయడం మాత్రం అస్సలు కుదరదని నమ్రత చెప్పుకొచ్చారు.తన భర్త షాపింగ్ కూడా నేనే చేస్తానని ఆయన నాకోసం ఏం షాపింగ్ చేయడని నమ్రత కామెంట్లు చేశారు.
అయితే మహేష్ బాబు నుంచి షాపింగ్ ఎక్స్ పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నమ్రత చెప్పుకొచ్చారు.మహేష్ బాబుకు అంత సమయం ఉండదని నమ్రత కామెంట్లు చేశారు.
అందువల్ల నా పనులు నేనే చూసుకుంటానని నమ్రత అన్నారు.దుబాయ్, అమెరికాలో షాపింగ్ చేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని నమ్రత అన్నారు.
తాను కంఫర్ట్ గా ఉండే స్టైలింగ్ ను ఇష్టపడతానని ప్రత్యేకంగా స్టైలింగ్ ను ఫాలో కానని ఆమె చెప్పుకొచ్చారు.అభిమానులు నన్ను సినిమాలలో చూడాలని అనుకుంటున్నారని వాళ్లను తాను బాధ పెడుతున్నానని నమ్రత తెలిపారు.
ప్రస్తుతం నేను కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నానని నమ్రత చెప్పుకొచ్చారు.

ఫ్యామిలీని చూసుకోవడంలో నాకు ఓ సంతృప్తి ఉందని ఆమె కామెంట్లు చేశారు.ఈ కారణం వల్లే తాను సినిమాలపై దృష్టి పెట్టడం లేదని నమ్రత అన్నారు.నమ్రత చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నమ్రత కనీసం మహేష్ బాబు సినిమాలలో అయినా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమమవుతున్నాయి.







