కొమరం భీముడో పాటని లిక్కర్ పాటగా మార్చిన చలాకి చంటి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Chalaki Chanti Turns Komaram Bheem Song Into A Liquor Song Details, Chalaki Cha-TeluguStop.com

ఇప్పటికి కూడా ఈ షో మంచి ఆదరణతో ప్రసారమవుతుంది.కానీ గతంలో ఈ షో బాగా విమర్శలు ఎదుర్కొంది.

ఇందులో స్కిట్ లో భాగంగా కమెడియన్స్ పర్ఫామెన్స్ చేసి కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంటారు.

ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులు ఈ షోపై పలు విమర్శలు చేయడమే కాకుండా తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు కొందరి కమెడియన్స్ పై కూడా పోలీస్ కేసు వేశారు.

అలా ఇప్పటికీ హైపర్ ఆది, షకలక శంకర్, వేణు వండర్స్ వంటి పలువురు కమెడియన్స్ కూడా ప్రేక్షకుల నుండి బాగా విమర్శలు ఎదుర్కొన్నారు.

గతంలో ఈ షోలో కమెడియన్స్ హిందూ మతాల వాళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ షోను బ్యాన్ చేయాలని బాగా డిమాండ్ చేశారు.

కానీ కమెడియన్స్ మీడియా ముందుకు వచ్చి తమ క్షమాపణలు తెలుపుకొని ఈ షో తమకు ఆదరణ అని చెప్పుకోవడంతో కొన్ని సంఘాలు వాళ్లను వదిలేశాయి.

ఇక కొన్ని అభిమాన సంఘాలు కూడా ఈ షో పై బాగా విమర్శలు చేసింది.

తమ అభిమాన హీరో గురించి తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ స్కిట్ చేయడంతో కొందరు అభిమాన సంఘాలు వచ్చి ఇందులో కమెడియన్స్ పై బాగా ఫైర్ అయ్యారు.అలా తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చలాకి చంటి పై ఫైర్ అయ్యారు.

జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.తన కామెడీతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.గతంలో పలు షోలలో యాంకరింగ్ కూడా చేశాడు.ఆ సమయంలో జబర్దస్త్ దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో తన స్కిట్ లతో బాగా అదరగొడుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో చలాకి చంటి ఎన్టీఆర్ పాటను మరోలా పాడారు.ఈసారి చలాకి చంటి తాగుబోతు స్కిట్ తో రాగా.అందులో ఆయన వేసిన పంచులు బాగా హైలెట్ గా మారాయి.అంతేకాకుండా త్రిబుల్ ఆర్ సినిమా లోని కొమరం భీమ్ పాటను మందు మీద పాడాడు.

దీంతో చలాకి చంటి పాడిన పాట పై ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.గొప్ప సందర్భంలో ఉపయోగించిన ఈ ఎమోషనల్ పాటను తాగుబోతుల పాటగా మార్చుతారా అంటూ ఫైర్ అవుతున్నారు.అంతే కాకుండా ఆయన పై దారుణమైన కామెంట్లు కూడా చేస్తున్నారు.గతంలో కూడా చలాకి చంటికి ఓ వివాదం ఎదురు కాగా ఇప్పుడు ఈ పాటతో మరో వివాదం ఎదురైందని తెలుస్తోంది.

మరి ఈ విషయం గురించి చలాకి చంటి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube