టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాలో నటించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 3వ తేదీ విడుదల అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను రాబడుతోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ విధంగా ఇప్పటి వరకు ఈ సినిమా ఎన్ని టికెట్లను సేల్ చేసింది అనే విషయాలను షేర్ చేస్తూ ఇలా తను ఈ సినిమా కలెక్షన్ల గురించి చెప్పడానికి కారణాన్ని కూడా వివరించారు.
ఈ విధంగా కలెక్షన్ల గురించి షేర్ చేయడంతో ఎందుకు సినిమా కలెక్షన్లను ఇలా ఎందుకు చెబుతున్నారు అంటూ చాలామంది తనని ప్రశ్నిస్తున్నారని సందీప్ తెలిపారు.ఇక ఈ విషయాలన్నింటిని గురించి అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటివరకు మేజర్ సినిమాని ఏకంగా రెండు మిలియన్ల మంది వీక్షించారని తెలిపారు.ఈ సినిమా ఎంత మంది హృదయాలను హత్తుకుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇండియా లవ్స్ మేజర్ అంటూ పోస్ట్ చేశాడు.తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబట్టాయి.ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాని మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన సంగతి తెలిసిందే.







