బేసిగ్గా మనం కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలను మనమే పరిష్కరించుకుంటాం.ఆమాత్రం దానికి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు అని వూరుకుంటాం.
అయితే కొంతమంది మాత్రం అలా కాదు.ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే అని పట్టుబడతారు.
అయితే సమస్య తీవ్రత అనేది వారికే తెలుస్తుంది లెండి.ఇక్కడ కూడా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ వెళ్ళాడు.
ఊరికే వెళ్ళలేదు, సరాసరి చేతితో కాగితం పట్టుకుని వెళ్ళాడు.దాంతో ఫిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు.
అక్కడికి వెళ్లిన వెంటనే సదరు వ్యక్తి తన చేతిలో ఉన్న ఫిర్యాదు కాపీని అక్కడున్న పోలీసులకు ఇచ్చాడు.అయితే అది తీసుకున్న పోలీసులు.ఆ ఫిర్యాదును చదివి అవాక్కయ్యారు.
వారికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.
ఇంతకీ ఆ ఫిర్యాదులో ఏముందో తెలుసా? అతగాడు ఓ కుక్క పై ఫిర్యాదు చేశాడు.వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ ఈ ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.
విషయం ఏమంటే, తనను ప్రతీ సారి గూడూరు మండలంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ కుక్క కరవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అందువలన ఆ కుక్కను పెంచుకున్న వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పూల్య నాయక్.ఈ ఫిర్యాదును చూసి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఇక ఫిర్యాదు ఇచ్చిన తరువాత పని చేయకపోతే బాగుండదు కదా అని పోలీసులు, ఆ కుక్కను పెంచుతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
కుక్క ఎవరిని కరవకుండా చూడాలని ఆదేశించారు.కుక్క కరిచిన దారవత్ పూల్య నాయక్ ను చికిత్స చేసే బాధ్యతను ఓనర్ కు అప్పగించారు.దాంతో సదరు బాధితుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.







