నా గాడ్ ఫాదర్ ఆయనే.. సినిమా కష్టాలపై అనిల్ రావిపూడి!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుస హిట్ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఈయన పటాస్ మొదలుకుని ఇప్పుడు వచ్చిన ఎఫ్ 3 సినిమా వరకు అన్ని కూడా సూపర్ హిట్ సినిమాలనే తెరకెక్కించాడు.

 Anil Ravipudi Interview About His Success Story Details, , F3 Movie, F3 Promoti-TeluguStop.com

సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడు.ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’.

ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

ఇక ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మరోసారి తన కామెడీ తో ప్రేక్షకులను అలరించాడు.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అనిల్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా ఈయన చాలా విషయాలపై మాట్లాడారు.ఈయనకు చిన్నప్పటి నుండే సినిమా పిచ్చి ఎక్కువుగా ఉండడంతో బిటెక్ అయిపోగానే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.

Telugu Anil Ravipudi, Anilravipudi, Heart Rk, Dil Raju, Varun Tej, Venkatesh-Mov

ఆ తర్వాత రైటర్ గా మారాను.అప్పట్లో జీతం చాలా తక్కువుగా ఉండేది.డబ్బులు సరిపోయేవి కాదు.

అయితే నేను పెద్దగా కష్టాలు పడలేదు.మా అక్కయ్య, పెద్దమ్మ వాళ్ళు హైదరాబాద్ లోనే ఉండడం వల్ల డబ్బుకు, తిండికి కష్టాలు పడలేదు.

అలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను పెద్దగా కష్టపడలేదు.పటాస్ నుండి నా వెనుక దిల్ రాజు ఉన్నారు.

నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా వెల్ విషర్ దిల్ రాజు నే అని చెబుతాను.అలాగే ఆయన తన గాడ్ ఫాదర్ గా తన బాబాయ్ పేరును చెప్పాడు.

ఎందుకంటే అయన వల్లనే ఇండస్ట్రీకి వచ్చి.ఆయన ఎంకరేజ్ మెంట్ వల్లనే సినిమాలు ఎక్కువుగా చూసి ఏ సీన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలిసింది.

అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube