మన చుట్టుపక్కల మనకు తెలియకుండానే అనేక విషయాలు ఉంటాయి.మనకు తెలియకుండానే అనేక అవకాశాలను మిస్ చేసుకుంటూ ఉంటాము.
దానికి కారణం ప్రతిదానిపై సరైన అవగాహన లేకపోవడం అని చెప్పవచ్చు.అనేక విషయాల గురించి తెలియకపోవడం వల్ల అనేక రకాల అవకాశాలను కోల్పోతూ ఉంటాము.
దాని వల్ల మనకు నష్టం జరుగుతూ ఉంటుంది.అందుకే అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల నష్ట పోకుండా ప్రతి అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోవచ్చు.
ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది.చాలామంది ప్రయాణిలకు వీటి గురించి తెలియకపోవడం వల్ల అవకాశాలను మిస్ చేసుకుంటున్నారు.టికెట్ల విషయానికి సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయి.ఏదైనా కారణం చేత మీ రైలు ప్రయాణం మిస్ అయిందనుకున్నాం… ఎవరైనా ఏం చేస్తారు.
ముందు టికెట్ ను క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తారు.అయితే ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి కుదరదు.
దీని వల్ల మీ డబ్బులు వెనక్కి రావు.దీని వల్ల మీ టికెట్ డబ్బులు వృథా అయినట్లే కదా.ఒకవేళ ప్రయాణానికి కొన్ని గంటల ముందే క్యాన్సిల్ చేసినా క్యాన్సలేషన్ ఛార్జీలు కట్ అవుతాయి.టికెట్ డబ్బులన్నీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు.

అయితే ఇలాంటి సమయాల్లో మీ టికెట్ ను వేరేవారికి బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంది.మీ టికెట్ పై వేరే వ్యక్తులు కూడా ప్రయాణించవచ్చు.దీని కోసం ట్రైన్ బయలుదేరే 24 గంటల ముందు వేరే వ్యక్తి పేరు మీదకు టికెట్ ట్రాన్స్‌ఫర్ చేస్తూ అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది.ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వారా టికెట్ బదిలీ చేస్తూ దరఖాస్తు సమర్పించవచ్చు.
ఆఫ్ లైన్ ద్వారా అయితే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి టికెట్ బదిలీ చేయాలి.టికెట్ ప్రింట్ తో పాటు బదిలీ చేసే వ్యక్తి ఐడీ ఫ్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మీ కుటుంబసభ్యులకు లేదా బంధుమిత్రులకు ఇలా టికెట్ ను బదిలీ చేయవచ్చు.ఈ అవకాశం ఉందని తెలియక చాలామంది ప్రయాణికులు మిస్ చేసుకుంటున్నారు.







