టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళిని భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రేక్షకులు అభిమానిస్తారు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాలు ఇతర భాషల్లో కూడా రికార్డుస్థాయిలో కలెక్షన్లను సాధించాయి.
అయితే తన ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు జక్కన్న మాత్రం ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా జవాబిచ్చారు.రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు ఇచ్చిన జవాబులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తన ఫేవరెట్ హీరో ఎవరో పబ్లిక్ గా చెప్పేంత మూర్ఖుడిని తాను కాదని అన్నారు.లౌక్యం ఉండాలని లౌక్యం లేకపోతే సినిమా ఇండస్ట్రీలోనే కాదని ఎక్కడైనా బ్రతకలేమని రాజమౌళి కామెంట్లు చేశారు.
తెలుగులో అయితే తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని తారక్ ను తాను ఎంతగానో ఇష్టపడతానని రాజమౌళి చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో ఏకంగా 4 సినిమాలు తెరకెక్కాయి.
కెరీర్ తొలినాళ్లలో తారక్ రాజమౌళికి ప్లస్ కాగా రాజమౌళి తారక్ కు ప్లస్ కావడం గమనార్హం.స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తారక్, రాజమౌళి కెరీర్ లో తొలి సక్సెస్ చేరింది.
ఆ తర్వాత సింహాద్రి సినిమా కోసం తారక్, రాజమౌళి కలిసి పని చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు.స్టూడెంట్ నంబర్1 సక్సెస్ సాధించినా సింహాద్రి సినిమా విజయంతోనే రాజమౌళి స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకున్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్, జక్కన్న కాంబినేషన్ లో యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కాయి.రాజమౌళి వల్లే మెగా, నందమూరి హీరోల కాంబినేషన్ లో సినిమా సాధ్యమైందని చెప్పవచ్చు.ఎన్టీఆర్ సోలో హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో చూడాల్సి ఉంది.







