ఏపీలో కొన్నిరోజుల్లో మరోసారి ఎన్నికల సమరం జరగనుంది.మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు బైపోల్ అనివార్యమైంది.
ప్రస్తుతం నామినేషన్లు కూడా కొనసాగుతున్నాయి.ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి కుటుంబం నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు.
అయితే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది.బీజేపీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు, ఆ ఫ్యామిలీకి మొదటి నుంచి ప్రత్యర్థిగా ఉన్న బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి.మరి ఆత్మకూరు ఉపఎన్నికపై ఎక్కడా జనసేన నోరు విప్పడం లేదు.దీంతో బీజేపీ పోటీ చేయడం జనసేన పార్టీకి ఇష్టం ఉందా లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
సాధారణంగా ప్రేమికుల మధ్య దూరం ఎంత ఎక్కువ ఉంటే విరహం పెరిగి అంత దగ్గర అవుతారు.ఒక విధంగా దూరమే వారిని దగ్గరకు చేరుస్తుంది.
మరి రాజకీయాల్లో ఇదే సూత్రం వర్కవుట్ అవుతుందా అంటే నిస్సందేహంగా కాదనే చెప్పాలి.
దీనికి ఉదాహరణగా జేపీ నడ్డా పర్యటనను గమనించవచ్చు.

ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తుంటే ఆ పర్యటనకు జనసేన అధినేత పవన్ దూరంగా ఉన్నారు.పవన్‌కు వేరే కార్యక్రమాలు ఉండటంతోనే ఆయన జేపీ నడ్డా టూర్‌కు దూరంగా ఉన్నారని జనసేన నేతలు వివరణ ఇస్తున్నారు.కానీ విషయం ఏంటంటే.ఆత్మకూరు ఉపఎన్నికలో పోటీ విషయాన్ని బీజేపీ ఏకపక్షంగా తీసుకోవడం పవన్‌కు నచ్చలేదట.ఈ విషయంలో ఆయన హర్ట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

కానీ బీజేపీ నేత పురంధేశ్వరి మాత్రం ఆత్మకూరు ఉప ఎన్నిక విషయాన్ని జనసేనతో సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు.అయితే జనసేన ఒక సిద్ధాంతం ప్రకారమే బద్వేల్ బరిలో పోటీ చేయలేదు.ఇప్పుడు ఆత్మకూరు నుంచి కూడా తప్పుకుంది.
చనిపోయిన వారి ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేస్తే పోటీకి పెట్టకూడదని తమ పార్టీ విధానమని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.మొత్తానికి ఆత్మకూరు బైపోల్ అంశంలో బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నా దూరంగా ఉన్నాయనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.







