వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త.. ఆ మెసేజ్‌లన్నీ ఒకేచోట!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp తమ యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ వస్తోంది.ఈ క్రమంలో కొత్తగా WhatsApp డెస్క్‌టాప్ బీటా వెర్షన్ 2.2221.1లో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.దీనిపేరు Unread Chat Filter ఫీచర్.ఈ కొత్త ఫీచర్ ద్వారా WhatsApp యూజర్లు చదవని చాట్ మెసేజ్ లను ఒకేచోట చదువుకొనే వీలుంది.చాట్ ఫీల్టర్ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్ చూడని చాట్ మెసేజ్ లన్నీ ఒకేచోట హైలెట్ గా కనిపిస్తాయి.తద్వారా మీరు వాటిని వీలైనప్పుడు చదువుకొనే అవకాశం కల్పిస్తుంది.

 Good News For Whatsapp Users All Those Messages In One Place , Whatsapp, New Fe-TeluguStop.com

అలాగే, ఇక్కడ మరో వెసులుబాటు కూడా WhatsApp కల్పిస్తోంది.పంపిన మెసేజ్‌లో ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకునేలా ఎడిట్ మెసేజ్ ఫీచర్ కూడా దీనితోపాటుగా తీసుకొస్తోంది.

అయితే ఈ ఎడిట్ బటన్ అప్షన్ ఇంకా టెస్టింగ్ దశలోనే వుంది.XDA డెవలపర్ల ప్రకారం.WhatsApp డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త చాట్ ఫిల్టర్‌పై పనిచేస్తోంది.వెబ్‌సైట్ వెర్షన్ 2.2221.1లో WhatsApp డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది.XDA ద్వారా షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.సెర్చ్ బాక్సు పక్కన ఫిల్టర్ బటన్ కూడా కనిపిస్తుంది.

Telugu Latest, Whatsapp-Latest News - Telugu

ఇక మీరు ఏదైనా ఫిల్టర్‌ను సెలెక్ట్ చేసినప్పుడు.WhatsApp చదివిన అన్ని చాట్‌లను హైడ్ చేస్తుంది.మీరు చూడని చాట్‌లను మాత్రమే ఇక్కడ హైలెట్ చేసి చూపిస్తుందనే విషయం మర్చిపోవద్దు.మీరు చదవని చాట్‌లన్నింటినీ చదివిన తర్వాత ఫిల్టర్‌ను క్లియర్ చేసుకోవచ్చు.రోజువారీగా అధిక సంఖ్యలో మెసేజ్‌లు వచ్చే WhatsApp యూజర్లకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ఫీచర్‌ ద్వారా చదవని మెసేజ్ లను సులభంగా చూడవచ్చు.

అలాటివారిని ఉద్దేశించే WhatsApp ఈ రకమైన ఫీచర్లను లాంచ్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube