చంద్రబాబు చుట్టూ కోటరీ ఉందని, వాస్తవ విషయాలు బాబు కు చేరకుండా వారే అడ్డుకుంటున్నారని, టిడిపికి ఈ పరిస్థితి రావడానికి కారణం వారేనని, చాలాకాలంగా సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.పార్టీలో ఎమ్మెల్యేలు కీలక నాయకులంతా బాబు కోటరీలో కీలకంగా ఉన్న నాయకుడి తీరు తో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
చంద్రబాబుకు అన్ని తానై వ్యవహరిస్తూ, వాస్తవాలు బాబు చెవిన పడకుండా , ఆయన పర్మిషన్ లేనిదే ఎవరు బాబు ను కలవకుండా అంతర్గతంగా అనేక ఆంక్షలు విధించారని, ఆయన డైరెక్షన్ లోనే చంద్రబాబు నడుస్తున్నారని , తెలుగు తమ్ముళ్లు అంతర్గతంగా చాలాకాలం నుంచి చర్చించుకుంటూన.ఉన్నారు.
ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన దివ్యవాణి సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు .చంద్రబాబు కొంతమంది వ్యక్తుల చేతుల్లో బందీ అయ్యారని, అందుకే అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని వారు చెబుతున్నారు.సీనియర్ల నుంచి జూనియర్ ల వరకు ఆయన రాజకీయానికి ఇబ్బందులు పడిన వారెనని పార్టీలో కీలక నాయకులే చెబుతున్న మాట.టిడి జనార్దన్ పేరు బయట అంతగా జనానికి పరిచయం లేకపోయినా టిడిపిలో కీలక నాయకులు అందరికీ ఆయనకు ప్రాధాన్యమేమిటో తెలుసు చంద్రబాబుకు అని వ్యవహరిస్తూ ఉంటారు.చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి ఏ పదవి కట్టబెట్టాలని బాబు ఏ విషయంపై ఏవిధంగా మాట్లాడాలి అనేది అన్ని టిడి జనార్దన్ చూసుకుంటారని పార్టీలో నాయకులందరికీ అనుభవమే.టిడి జనార్దన్ ఎక్కువగా మీడియా ముందుకు రారు వెనకుండే కానీ వ్యవహరిస్తూ ఉంటారు.
ఈన మాజీమంత్రి నెట్టం రఘురాం బంధువుగా ఎంట్రీ ఇచ్చారు 1999లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆప్కాబ్ చైర్మన్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు.
పార్టీలో క్రియాశీలకంగా మారారు ఎప్పుడు చంద్రబాబుకు దగ్గరగా ఉంటూ నమ్మకమైన వ్యక్తి గా మారారు.2014 ఎన్నికల్లో ఏపీ తెలంగాణ విభజన తర్వాత టిడి జనార్దన్ చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.ఇటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా టిడి జనార్దన్ పేరు సంపాదించారు.
అమరావతి పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ లావాదేవీలు వ్యవహారంలోనూ వీర పాత్ర ఉంది అనే విమర్శలు ఉన్నాయి అలాగే లోకేష్ వినని గా కూడా కొంత మంది విమర్శలు చేస్తుంటారు.పార్టీ నుంచి బయటకు వెళ్లేవారు చాలామంది టి జనార్ధన్ పేరు చెబుతూ ఉంటారు ఆయన చంద్రబాబు ఏం విషయంలో ఏమి పట్టించుకోనట్టు గాని వ్యవహరిస్తూ ఉంటారు ఆయనపై ధైర్యంగా ఫిర్యాదు చేసే పార్టీలు ఎవరు చేయలేకపోవడంతో ఆయన అవ్వ ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతూనే ఉందనేది పార్టీ నాయకులే చెబుతున్న మాట.