స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ‘చోర్ బజార్’ చిత్రం నుంచి 'నూనుగు మీసాల' లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’.గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది.

 Heroine Samantha Launched Noonugu Meesala Song From Chor Bazaar Details, Heroine-TeluguStop.com

దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు.తాజాగా ఈ చిత్రంలోని ‘నూనుగు మీసాల’ లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు.

హీరోయిన్ సోలో సాంగ్ ఇది.ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది నాయిక.“నూనుగు మీసాల పోరడు చూడు ఎదురుసూరీడే, నామీద నజర్ ఏసిండే, రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే, వాని గుండెల్ల దాచిండే, వాని బొమ్మ గీసి, మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో, వాణ్ని చేరితే చాలయ్యో, మళ్లొస్తడాని బాట మీద కూసోనున్న ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో” …అంటూ సాగుతుందీ పాట.ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా…కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు.లక్ష్మీ మేఘన పాడారు.భాను కొరియోగ్రఫీచేశారు.“చోర్ బజార్” సినిమా త్వరలోనే థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ – గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో – లహరి, కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను, పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో – జీఎస్కే మీడియా, మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా – వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి.జీవన్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube