తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.ఎప్పుడు కూడా కంటెస్టెంట్స్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఆయన ఎంపిక అయ్యాడు.ఈయన ఎంపిక అయ్యాడు అంటూ చాలా రకాలుగా వార్తలు వస్తాయి.
కాని ఈసారి మాత్రం నాగార్జున స్థానంలో సమంత కొత్త హోస్ట్ గా రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో ఈ విషయమై చాలా పెద్ద చర్చ జరిగింది.
వెబ్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రథానంగా చూపించేయడం తో బిగ్ బాస్ లో ఈసారి సమంత కనిపించబోతుందని అంతా అనుకున్నారు.నాగార్జున కంటే చాలా తక్కువ పారితోషికం తీసుకుని సమంత ఈ షో ను చేస్తుందని.
అక్కినేని వారి కుటుంబంతో ఉన్న కోపంతోనే సమంత ఇలా చేస్తుంది అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ వ్యవహారం మొత్తానికి ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను.
అసలు విషయం ఏంటీ అంటే బిగ్ బాస్ సీజన్ 6 కు హోస్ట్ ఇప్పటికే ఖరారు అయ్యాడు.అది మరెవ్వరో కాదు నాగార్జున.ఆయన ఓకే అవ్వడం వల్లే మొదటి ప్రోమో కూడా వచ్చేసింది.సామాన్యులకు ఈసారి అవకాశం అంటూ ఆయన చెప్పడం ఒక ప్రోమో వచ్చింది.
ఆ ప్రోమో కాస్త వైరల్ అయ్యింది.ప్రోమో లో నాగార్జున ఉన్నాడు కనుక ఎలాంటి డౌట్ అక్కర్లేకుండా బిగ్ బాస్ సీజన్ 6 యొక్క హోస్ట్ నాగార్జున అంటూ వార్తలు వస్తున్నాయి.
సమంత అంటూ కొందరు వెంకటేష్ అంటూ మరి కొందరు చేస్తున్న వ్యాఖ్యలు మరియు పుట్టిస్తున్న పుకార్లు అన్ని కూడా గాలి వార్తలే.అసలు నాగ్ కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 కు మరెవ్వరు హోస్ట్ అన్నా కూడా మీరు నమ్మకండి.







