తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభంకు గంట మోగింది.జులై లేదా ఆగస్టు లో షో స్టార్ మా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
బిగ్ బాస్ సీజన్ 5 లో దీప్తి సునైన ప్రియుడు అయిన షన్నూ కంటెస్టెంట్ గా వచ్చిన విషయం తెల్సిందే.అంతకు ముందు దీప్తి సునైన కు అవకాశం దక్కింది.
దీప్తి లోపల ఉన్నప్పుడు షన్నూ… షన్నూ లోపల ఉన్న సమయంలో దీప్తి లు చాలా కాంపెయినింగ్ చేయడం జరిగింది.షన్నూ బయటకు వచ్చిన తర్వాత బ్రేకప్ అయ్యింది కాని మొత్తానికి అయితే ఇద్దరు ఒక సీజన్ తర్వాత మరొకరు వెళ్లడంతో చాలా హెల్ఫ్ అయ్యి ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇప్పుడు అదే తరహా లో శ్రీహాన్ కూడా వెళ్లబోతున్నాడు.శ్రీహాన్ ఎవరో అందరికి తెల్సిందే.
గత సీజన్ లో టాప్ 5 వరకు నిలిచిన సిరి హనుమంతు ప్రియుడు ఇతడు.వీరిద్దరి మద్య ఇటీవల బ్రేకప్ వార్తలు వచ్చాయి.కాని అవి నిజం కాదని తెలుస్తోంది.ఇప్పుడు శ్రీహాన్ కు తెలుగు బిగ్ బాస్ టీమ్ నుండి కాల్ వచ్చింది.
ఆయన కూడా చాలా ఆసక్తిగా షో లో అడుగు పెట్టడం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.బయట ఎలాగూ సిరి ఓట్లను వేయించగలదు.
అందుకే శ్రీహాన్ హాయిగా వెళ్లి లోపల ఎంజాయ్ చేసి రావచ్చు అనుకుంటున్నాడట.ఖచ్చితంగా శ్రీహాన్ లోనికి వెళ్తే కనీసం టాప్ 5 వరకు అయినా ఉండే అవకాశం ఉంది.
గత సీజన్ లో షన్నూ టాప్ 2 వరకు వెళ్లాడు.కాని శ్రీహాన్ అక్కడి వరకు వెళ్తాడా అంటే అనుమానమే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ విషయం గురించి చాలా జోరుగా చర్చ జరుగుతోంది.







