ఎఫ్‌ 3 ఎంత రాబట్టినా దిల్‌ రాజు మొహంలో సంతోషం కష్టమేనా?

వెంకటేష్, వరుణ్‌ తేజ్ కలిసి నటించిన ఎఫ్‌ 3 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఎఫ్‌ 3 సినిమా ను పలు ఏరియాల్లో భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుగోలు చేశారు.

 Dil Raju Not Happy With F3 Movie Collections Details, Anil Ravipudi, F3 Movie,-TeluguStop.com

ఎక్కువ ఏరియాల్లో దిల్‌ రాజు సొంతంగా విడుదల చేయడం జరిగింది.అక్కడ కూడా అమ్మేసి ఉంటే మొత్తంగా వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉండేది.

కాని సినిమా పై నమ్మకంతో విడుదలకు ముందు బయ్యర్లకు అమ్మేందుకు ముందుకు రాలేదు.దాంతో ఎఫ్ 3 సినిమా ఇప్పుడు సాధిస్తున్న వసూళ్లు చూసి దిల్‌ రాజు మొహాన నెత్తురు చుక్క లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఎఫ్‌ 2 సినిమా వంద కోట్ల వరకు రాబట్టింది.కనుక ఎఫ్‌ 3 సినిమా అంతకు ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా వసూళ్లు చేస్తుంది అంటూ దిల్ రాజు నమ్మకం గా ఉండేవాడు.

కాని ఇప్పటి వరకు సినిమా 50 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోయింది.లాంగ్‌ రన్ లో సినిమా 75 కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

రెండవ వారంలో సినిమా అడుగు పెట్టింది.మేజర్ మరియు విక్రమ్‌ సినిమా లు వచ్చాయి.

దాంతో ఎఫ్ 3 సినిమా వసూళ్లు డ్రాప్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎనిమిది వారాల వరకు ఎఫ్ 3 ని ఓటీటీ లో విడుదల చేయాలని భావించడం లేదు.

Telugu Anil Ravipudi, Dil Raju, Mehreen, Sonal Chouhan, Tamannah, Varun Tej, Ven

కనుక అప్పటి వరకు నిలకడగా వసూళ్లు వస్తాయని కొందరు అనుకుంటున్నారు.కాని ఈ లోపు చాలా సినిమా లు వచ్చే అవకాశం ఉంది.కనుక ఎఫ్ 3 సినిమా కు ఎంత వరకు వసూళ్లు నమోదు అవుతాయి అనేది క్లారిటీ లేదు.మొత్తానికి ఎఫ్ 3 సినిమా ఎంత వసూళ్లు రాబట్టినా కూడా దిల్‌ రాజు మొహం లో మాత్రం ఆనందం కనిపించడం కష్టం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే వంద కోట్ల ఆఫర్‌ ను కాదనుకుని సొంతంగా విడుదల చేయడం వల్ల భారీ గా నష్టపోవాల్సి వచ్చింది అనేది ఆయన అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube