టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్న బాలయ్య మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొట్టేశాడు బాలకృష్ణ.
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆ షో రేటింగ్స్ తో దూసుకుపోయింది.అన్‌స్టాపబుల్ సీజన్ 1 ముగిసిన తర్వాత అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఆహా లో మరోసారి బాలయ్య బాబు.
ఆహా ఓటీటీ లో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి ముఖ్యఅతిథిగా ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య.జూన్ 10 న స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
ఇక షోలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలకృష్ణ ఫుల్ ఎనర్జీతో వన్ మ్యాన్ షో చేసేస్తున్నారు.ఇక బాలయ్య షోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జై బాలయ్య అని నినాదాలు అనిపించేలా అదరగొట్టేవారు బాలయ్య బాబు.
మొదట సింహమంటి చిన్నోడు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.క్యాజువల్ గా రాలేదు.కాంపిటేషన్‌కి వచ్చా అంటూ పవర్ ఫుల్ పంచ్‌లు వేశారు.

ఆ తరువాత టాప్ 6కి చేరిన కంటెస్టెంట్.అఖండ టైటిల్ సాంగ్ పాడటంతో లేచి చప్పట్లు కొట్టారు.అయితే ఆ సింగర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుండటంతో చమత్కరించారు బాలయ్య.
పెళ్లి చేసుకోబోతున్నావట.పెళ్లి ఎప్పుడు అని అడగను.
ఎందుకయ్యా పెళ్లి అని అడుగుతా అంటూ అతనికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు బాలయ్య.నందమూరి బాలకృష్ణ రాసిన భార్యని ఏమార్చడం ఎలా? 30 సూత్రాలు అనే పుస్తకాన్ని ఆ సింగర్‌కి అందిస్తు.ఈ ఒక్క బిట్ మాత్రం మా ఇంట్లో టెలికాస్ట్ కాకుండా చూడండి ప్లీజ్.మళ్లీ వసుంధర గారు చూసిందంటే దబిడిదిబిడే అంటూ పంచ్ వేశారు బాలయ్య.







