సాధారణంగా భారతీయులు పాములను పూజిస్తారు.నాగుల చవితి వచ్చిందంటే చాలు పుట్టల వద్దకు క్యూ కడతారు.
అక్కడ గుడ్లు, పాలు, పువ్వులు పెట్టి పూజలు చేస్తారు.భక్తిభావంతో పాములను నాగదేవతలుగా కొలుస్తారు.
అయితే ఎంత భక్తిభావం ఉన్న ప్రాణాల మీదకు వస్తే కొట్టి చంపేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.ఇక ఏదైనా చిన్న పాము ఇంట్లోకి వచ్చినా అంతా హడావుడి పడిపోతుంటారు.
అది కాటు వేస్తే ఎంతటి మనిషైనా గంటలో ప్రాణం కోల్పోతాడు.ఇక ప్రాణాంతక బ్లాక్ కోబ్రాలు వంటివి కాటేస్తే వాటి విషం క్షణాల్లోనే ఒళ్లంతా పాకేస్తుంది.
చూస్తుండగా మనుషుల ప్రాణం పోతుంది.అలాంటివి మన కళ్ల ముందు కనపడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి ఉంటుంది.
ఇదే అనుభవం ఓ రైల్వే అధికారికి ఎదురైంది.ఆ అధికారి ఉంటున్న టేబుల్‌పైకి దర్జాగా ఆ బ్లాక్ కోబ్రా వచ్చింది.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లోని ప్యానల్ రూమ్‌లోని టేబుల్‌పై ఒక పెద్ద కింగ్ కోబ్రా విశ్రాంతి తీసుకోవాలని భావించింది.నేరుగా రవ్తా రోడ్ స్టేషన్‌లోని ఆఫీసర్ టేబుల్ వద్దకు చేరుకుంది.
అది దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంది.ఆ బ్లాక్ కోబ్రా తన టేబుల్ పైకి రావడంతో ఆ అధికారి అవాక్కయ్యాడు.అతడి గొంతు తడారి పోయింది.ఆఫీసులోని ఓ మూలకు చేరుకుని, నక్కి కూర్చుండిపోయాడు.మరో వైపు ఆ బ్లాక్ కోబ్రా మాత్రం ఎంచక్కా విశ్రాంతి తీసుకుంది.టేబుల్ పై దాదాపు 20 నిమిషాల పాటు ఉండి పోయింది.
ఎంతో రద్దీగా ఉండే ఆ రైల్వే స్టేషన్ ఆవరణలోనికి ఆ బ్లాక్ కోబ్రా ఎలా వచ్చిందో ఆ అధికారికి అస్సలు అర్థం కాలేదు.అయితే ఏ మాత్రం చిన్న కదలిక వచ్చినా, ఆ పాము అతడిని కాటు వేసే ప్రమాదం ఉంది.
దీంతో అక్కడే, అలాగే కదలకుండా ఆ అధికారి కూర్చుండి పోయాడు.ఈ సన్నివేశాన్ని ఓ ఫొటో జర్నలిస్టు చూశాడు.
వెంటనే తన కెమెరాతో క్లిక్ చేశాడు.కాసేపటికి అక్కడి నుంచి ఆ బ్లాక్ కోబ్రా వెళ్లి పోయింది.
ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టగా అవి వైరల్ అయ్యాయి.అంత సేపు ఆ బ్లాక్ కోబ్రా ముందు ఎలా ఉన్నాడోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







