హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఉదయం ఎన్.బి.
కె ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు హిందూపురం గ్రామీణ మండలం కిరికెర మాజీ సర్పంచ్ రాము నూతనంగా నిర్మించిన గృహప్రవేశానికి హాజరయ్యారు హైదరాబాద్ నుండి విమానంలో బెంగళూరుకు చేరుకున్న బాలకృష్ణ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తూముకుంట పారిశ్రామిక వాడ మీదుగా కిరికెర చేరుకున్నారు.కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో తూముకుంట చెక్ పోస్ట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు.
కిరికెర లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం నూతనంగా నిర్మించిన రాము గృహప్రవేశం లో పాల్గొని ఆశీర్వదించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాము బాలకృష్ణ కి పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న తన దృష్టికి తీసుకురావాలని తాను త్వరలో హిందూపురంలో బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







