'ఆర్సీ15' నుండి తప్పుకున్న టాప్ టెక్నీషియన్.. డైరెక్టర్ తో విభేదాలే కారణమా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు.ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Top Technician Left Ram Charan Rc15 Movie Details, Rc15, Ram Charan, Director Sh-TeluguStop.com

ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు.

ఇక ఈ సినిమా తో హిట్ కొట్టిన చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.ఇక ఇక్కడ కూడా షూటింగ్ ముగించు కున్నారు.

1993 నేపథ్యంలో పీరియాడిక్ ఫిక్షనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటుకే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది.

ఆర్సీ 15 సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమా కోసం పని చేస్తున్న టాప్ టెక్నీషియన్ ఒకరు పక్కకు తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Anjali, Art Ravindra, Shankar, Kiara Advani, Ramakrishna, Ram Charan, Rc,

ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణ ఈ సినిమా నుండి బయటకు వచ్చేసారట.ఈ సినిమా కోసం భారీ సెట్ లను నిర్మించిన ఈయన డైరెక్టర్ తో ఏర్పడిన విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు టాక్ బయటకు వచ్చింది.ఇతడి స్థానంలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ను తీసుకున్నారట.ఈ వార్త ఎంత నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube