ఈ కలియుగాన మనుషులు మానవత్వం, ఆప్యాయతానురాగాలు మరిచి, కేవలం డబ్బే స్వార్ధంగా బతుకుతున్న వేళ కొన్ని జంతువులు మాత్రం తమ గుంపులోని మిగతా జీవాల పట్ల మిక్కిలి ప్రేమను కలిగి ఉండటం నిజంగా ఓ అద్భుతమనే చెప్పుకోవాలి.సోషల్ మీడియా పుణ్యమాని అలాంటి సంఘటనలు విరివిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఫోటోలు, వీడియోల రూపంలో దర్శనమిస్తున్నాయి.ఇక అలాంటి వీడియోలు చూసినపుడు మనిషి వాటిని చూసైనా మారవలసిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది.
వివరాల్లోకి వెళితే, చాలాకాలం తరువాత కలిసిన 3 కోతుల మధ్య ఆప్యాయత చూస్తే ముచ్చటేస్తుంది.ఈ వీడియోను IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత్ నందా ఇటీవల తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయగా వెలుగులోకి వచ్చింది.
ఇక సదరు వీడియోని మనం చూసినట్లయితే చాలాకాలం తరువాత ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే ఎలా ఉండాలి అన్న విషయం మనకు స్ఫురణకు వస్తుంది.ఈ వీడియోలో 2 కోతులు, ఒక్కొక్కటి తమ వీపుపై తమ పిల్లలను కౌగిలించుకొని రావడం కనిపించింది.
ఒకకోతి పసిపాపను మరొకదాని నుండి తీసుకుంటుంది, అవిఅన్నీ ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకున్నట్లు ఈ వీడియోలో మనం గమనించవచ్చు.
సదరు వీడియోను సోమవారం సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేయగా ఇపుడు అది తెగ వైరల్ అవుతోంది.
దీంతో కేవలం 2 రోజుల్లోనే 40వేల మందికి పైగా ఈ వీడియోను చూడటం జరిగింది.మరో 3వేల మంది లైక్ లు చేస్తూ, కామెంట్లు చేయడం విశేషం.
ఈ సాదరంగా ఓ నెటిజన్.కరోనా మహమ్మారి తర్వాత వారు అనుభవించిన షరతులు లేని ప్రేమ చాలా ఆకట్టుకుంటుంది అని కామెంట్ చేసాడు.“అచ్చం ఒకప్పుడు మనుషుల్లాగే కోతులు” అంటూ నేటి మానవుడికి చురకలు అంటిస్తూ రీ ట్వీట్ చేయడం కొసమెరుపు.







