టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.తన చిన్ననాటి స్నేహితురాలు.
గర్ల్‌ఫ్రెండ్ జయా భరద్వాజ్‌ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు.ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో బుధవారం వీరి వివాహం వైభవంగా జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫొటోను దీపక్ చాహర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు.తన కల్యాణానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఊరేగింపులో బ్యాండ్ వాద్యాల చప్పుళ్లకు దీపక్ డ్యాన్స్ చేశాడు.బాణాసంచా కాలుస్తూ అతిథులు కూడా డ్యాన్స్ చేశారు.
తమ వెడ్డింగ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన దీపక్ చహర్.ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.
‘‘నేను మొదటిసారి నిన్ను కలుసుకున్నప్పుడు నాకు నీవే సరైనదానివి అని భావించాను.మన జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం.నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతానని ప్రామిస్ చేశాను.జీవితంలో ఒకానొక అద్భుత క్షణం.
ప్రతి ఒక్కరూ మాకు మీ దీవెనలు అందించాలి’’ అని చాహర్ పోస్ట్ పెట్టాడు.కాగా దీపక్ చహర్ అర్థాంగి జయా భరద్వాజ్ ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో కార్పోరేట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుంది.
దీపక్, జయను ఆశీర్వదించేందుకు రాజకీయ నేతలు, అధికారులు, పలువురు క్రికెటర్స్ విచ్చేసారు.
ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న వేళ స్టాండ్స్ లో కూర్చున్న ప్రియురాలు జయ భరద్వాజ్ కు దీపక్ చాహర్ ప్రేమను వ్యక్తం చేయడం, ఆ వీడియోను అతడు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవడం తెలిసిందే.రూ.14 కోట్లతో చాహర్ ను చెన్నై జట్టు కొనుగోలు చేసినప్పటికీ గాయాల కారణంగా అతడు 2022 సీజన్ కు అందుబాటులో లేకపోవడం తెలిసిందే.కాగా గతేడాది సీజన్లో సీఎస్‌కే విజేతగా నిలవడంతో దీపక్ చహర్ ముఖ్యపాత్ర పోషించాడు.ఈ సీజన్లో మాత్రం అంతగా ఆకట్టుకోని సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.