పాపం.. ఆ సమస్యతో బాధపడుతున్న ప్రభాస్, పవన్ కళ్యాణ్.. అందుకే సినిమాలు ఆలస్యం?

ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ లు తమ వ్యక్తిగత విషయంలోనే కాకుండా తమ ఆరోగ్యం విషయంలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఒకసారి ఆరోగ్యం దెబ్బతిన్నది అంటే వారి జీవితం మొత్తం అయోమయం గా మారుతుంది.

 Prabhas And Pawan Kalyan Are Suffering From That Problem So That Why The Movies-TeluguStop.com

అందుకే నటీనటులు తన ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటారు.ముఖ్యంగా తమ ఫిజిక్ విషయంలో మాత్రం వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు.

ఎందుకంటే ఒక్కసారి తమ ఫిజిక్ కోల్పోతే సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోయినట్లే.అలా ఇప్పటికీ చాలామంది నటీనటులు ఫిజిక్ విషయంలో జాగ్రత్తగా ఉండక పోవడంతో సినిమాల్లో అవకాశాలు కూడా కోల్పోయారు.

ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోల పరిస్థితి కూడా అలాగే మారుతున్నట్లు అనిపిస్తుంది.వాళ్ళు ఎవరో కాదు ప్రభాస్, పవన్ కళ్యాణ్.

వీళ్ళు కూడా తమ ఫిజిక్ విషయంలో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.వీరి ఫిజిక్ విషయంలో తమ సినిమాలు కూడా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది.

నిజానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల ఫిజిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు పవన్ ఇలా ఉన్నాడు కానీ కెరీర్ మొదట్లో మంచి ఫిజిక్ తో ఎంత మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఆయన ఫిజిక్ వల్లే చాలా సినిమాలు కూడా ఆయనకు దరిచేరాయి.కానీ ఇప్పుడు ఆయన తన ఫిజిక్ సమస్యతో బాధపడుతున్నాడు.పూర్తిగా తన ఫిట్నెస్ ను కోల్పోయాడు.మరి ఆయనకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే.

గతంలో ఆయన కోవిడ్ బారిన పడ్డాడు.ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తన ఫిజిక్ ను కోల్పోయాడు.

Telugu Fitness, Problem, Pawan Kalyan, Physic, Prabhas, Telugu, Tollywood-Movie

మునుపటిలా మారడానికి కూడా ఆయనకు సమయం లేదు.ముఖ్యంగా ఆయనకు కఠినమైన వర్కవుట్లు చేయడం కూడా చాలా కష్టం గానే ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ప్రభాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది అని తెలుస్తుంది.అదేంటి ప్రభాస్ ఫిజిక్ గురించి అలా అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా.నిజానికి ప్రభాస్ ఫిజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.

తన ఫిట్నెస్ వల్లే ఆయన చాలా సినిమాలకు అవకాశాలు అందుకున్నాడు.

కానీ ఇప్పుడు ప్రభాస్ లుక్ కూడా మొత్తం మారిపోయింది.అప్పటిలా ఫిట్ గా కాకుండా మామూలుగా కనిపిస్తున్నాడు.

దీంతో ఆయన పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని అనుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.నిజానికి ప్రభాస్ అనుకుంటే తన లుక్ ను మళ్లీ మునుపటిలా మార్చుకునే అవకాశం ఉంది.

Telugu Fitness, Problem, Pawan Kalyan, Physic, Prabhas, Telugu, Tollywood-Movie

ఎందుకంటే ఆయనలో ఆ ఎనర్జీ ఉంది.కాస్త శ్రద్ధ పెడితే చాలు ప్రభాస్ మునుపటిలా కావడానికి.పవన్ కళ్యాణ్ పరిస్థితి మాత్రమే ఎటు అర్థం కాకుండా ఉంది.దాంతో వీరు మంచి ఫిజిక్ సొంతం చేసుకునే వరకు తమ సినిమాలు కూడా కాస్త ఆలస్యంగా వస్తాయి అన్న టాక్ వినిపిస్తుంది.

చూడాలి మరి వీళ్ళు తర్వాత వచ్చే సినిమాల్లో ఎలా ఉంటారు అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube