టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు.ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
పూజా మొదట్లో వరుస ప్లాప్స్ ఎదురవడంతో ఈమెకు అంతా డిమాండ్ లేకపోయింది.అయితే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఈమెకు స్టార్ డమ్ దక్కింది.
ఈ సినిమా తర్వాత ఈమెను లక్కీ బ్యూటీ గా అభివర్ణిస్తున్నారు.
అప్పటి నుండి వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడమే కాకుండా అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.
దీంతో టాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీ లలో కూడా క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది.ఇటీవలే ఈమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయ్యాయి.
వీటి రిజల్ట్ ఎలా ఉన్న ఈమె నటన, గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రెసెంట్ ఈమె క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.
బాలీవుడ్ లో కభీ ఈద్ కభీ దివాలీ, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో రానున్న సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే ఈమెకు పూరీ కూడా ఆఫర్ ఇచ్చినట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి.
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తతో పాటు ఈమెను ఇందులో కేవలం స్పెషల్ సాంగ్ కోసమే అడిగారని కూడా రూమర్స్ వచ్చాయి.అయితే ఈ రూమర్స్ పై తాజాగా బుట్టబొమ్మ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

జనగణమన సినిమాలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లాంటిది ఏమీ చేయడం లేదని కేవలం కథానాయికగా మాత్రమే చేస్తున్నట్టు టీమ్ క్లారిటీ ఇప్పటి వరకు ఈమెపై వచ్చిన రూమర్స్ కు చెక్ పడింది.జనగణమన సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.ఇంతకు ముందే వీరి కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కింది.ఇది రిలీజ్ కాకుండగానే ఈ సినిమాను అనౌన్స్ చేసారు.ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని పూజా కూడా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు చెప్పినట్టు సమాచారం.







