మన ఇండియన్ పోస్టల్ సర్వీస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ ద్వారా పోస్టల్ పార్శిళ్లను డెలివరీ చేసి విజయం సాధించింది.గుజరాత్‌లోని కచ్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో డ్రోన్ కేవలం 25 నిమిషాల వ్యవధిలో 47 కిలోమీటర్ల దూరంలో వున్న సదరు కస్టమర్లకు పార్శిల్‌ను డెలివరీ చేసింది.
ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రోన్ ద్వారా 2 కిలోల పోస్టల్ పార్శిల్ డెలివరీ చేయడం గమనార్హం.ఇప్పటి వరకు ఫోటోగ్రఫీకి డ్రోన్‌లను ఉపయోగించేవారు.
కానీ, తొలిసారి పోస్టల్ పార్శిళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపడానికి ఇపుడు ఉపయోగిస్తున్నారు.దేశంలోనే అతిపెద్ద, సరిహద్దు జిల్లా అయిన కచ్‌లో తపాలా శాఖ ఒక కొత్త విజయవంతమైన ప్రయోగం చేసింది.
ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి.
ఒక ట్రయల్లో భాగంగా భారత తపాలా శాఖ డ్రోన్ ద్వారా తపాలా సేవలను ప్రారంభించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భుజ్ తహసిల్‌లోని హబే పోస్టాఫీసు నుంచి భచౌ తహసిల్‌లోని నెర్ గ్రామ పోస్టాఫీసు వరకు 47 కి.మీ మార్గాన్ని ఎంపిక చేసి 2 కిలోల పొట్లాలను డ్రోన్ ద్వారా పంపారు.ఈ డ్రోన్ పార్శిల్ 47 కి.మీ దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకుని ఆహుతులను ఆశ్చర్యపరిచింది.ఈ పరీక్షలో, డ్రోన్‌లో మందు పార్శిల్ లోడ్ చేశారు.ఇది డ్రోన్ ద్వారా 25 నిమిషాల్లో 47 కిలోమీటర్ల దూరాన్ని హబే గ్రామం నుంచి నెర్ గ్రామం వరకు విజయవంతంగా ల్యాండ్ చేశారు.

ట్రయల్ బేస్ ధృవీకరణ తర్వాత, ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చాక డ్రోన్ పోస్టల్ సేవను ప్రారంభించాలని అనుకుంటున్నారు.స్థానిక తపాలా శాఖ అధికారులతోపాటు ఉన్నత స్థాయి బృందం సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్ష కోసం కేంద్రం (ఢిల్లీ) నుంచి 4 మంది సభ్యుల బృందం కూడా వచ్చింది.డోర్‌స్టెప్ బ్యాంకింగ్ తర్వాత, పోస్టల్ శాఖ ఇప్పుడు డ్రోన్ డెలివరీ వంటి ఆధునికత వైపు అడుగులు వేయడం నిజంగా అభినందనీయం.







