కూతురుతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రియ శరన్.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ గురించి, తన నటన గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

 Shriya Sharan Enjoying Life With Her Daughter Video Going Viral , Shriya Sharan,-TeluguStop.com

ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

శ్రియ సరన్ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇక వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.లేటు వయసులో కూడా తన అందాలను అస్సలు తగ్గించుకో లేదు.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసింది.

ఇక ఈమెకు ఒక కూతురు కూడా పుటగా ఈ విషయాన్ని కొన్ని రోజుల వరకు ఇండస్ట్రీలో బయటపెట్టలేదు.ఆ తర్వాత ఆ విషయం అందరికీ తెలియటంతో అప్పటి నుంచి తన కూతురు ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.ఇక సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఎందుకంటే ఆ ఫోటోలు ఫుల్ రొమాన్స్ తో నిండిపోయి ఉంటాయి.ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.ఇక తన భర్త, పాపతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో ఒక వీడియో షేర్ చేసుకుంది.

అందులో తన పాపతో తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

ఇక ఆ వీడియో ని చూసిన నెటిజన్లు ఆ వీడియోకు లైకులు, కామెంట్లు పెడుతున్నారు.ఇక మొత్తానికి శ్రియ సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీతో మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

ఇక మళ్లీ ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube