టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.తక్కువ సమయంలో స్టార్ హోదా ను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది.
వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ఇక ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఎటువంటి గాసిప్ లకు లొంగలేదు.
కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మను ఒక గాసిప్ వెంటాడుతుంది.అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఆ గాసిప్ మాత్రం టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకూ అసలు ఏం జరిగిందో చూద్దాం.
తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.
ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.
తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి.అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ అమ్మడు F3 టీం తో గొడవ పడినట్లు తెలుస్తుంది.ఇటీవలే ఈ ముద్దుగుమ్మ అనిల్ రావిపూడి దర్శకత్వం లో విడుదలైన ఎఫ్ త్రీ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో తన పాత్రతో మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది.
ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా బాగా సందడి చేస్తుంది.
ఈ సినిమా థియేటర్ లో మరింత రప్పించడానికి ఈ సినిమా బృందం మళ్లీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.ఇప్పటివరకు ఈ సినీ బృందం చాలా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
కానీ తమన్నా మాత్రం రెండు చోట్ల తప్ప మరెక్కడా కనిపించలేదు.

పైగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఈ అమ్మడు కనిపించలేదు.నిజానికి ఆ సమయానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్ళింది.ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.
దీంతో తమన్నాకు, ఈ సిని బృందానికి మధ్య గొడవలు జరిగాయని తెలుస్తుంది.
ఈ విషయం టాలీవుడ్ లో బాగా వైరల్ గా మారడంతో ఇటీవలే ఈ విషయం గురించి అనిల్ రావిపూడి, దిల్ రాజ్, వరుణ్ తేజ్ లు ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.
తమ మధ్య ఎటువంటి గొడవలు లేదు అని మీడియా వాళ్లు అలా సృష్టిస్తారు అని క్లారిటీ ఇచ్చారు.నిజానికి తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో బిజీగా ఉంది.







