మనలో చాలామంది ట్రావెల్ చేసేటప్పుడు అంటే… బస్సులో గాని, ఆటో గాని, రైలులో గాని, కేబ్ లో గాని ప్రయాణం చేసినపుడు, సడెన్ గా వాంతులు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం.ఇలా అలా వాంతులతో శవాలుగా మారేవారిని అనేకమందిని చూడవచ్చు.
కొందరికి కారులో AC వేసిన సమయంలో కూడా వాంతులు అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం.ఈ విధంగా వాంతులు అవ్వడాన్ని వైద్యపరిభాషలో “మోషన్ సిక్నెస్” అని అంటారు.
అయితే ఈ విధంగా వాంతులు అవ్వడం అందరికీ ఒకే విధంగా ఉండదు.కొంతమందికి కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత వాంతులు స్టార్ట్ అవుతూ ఉంటాయి.
కొంతమందికి బస్సు ఎక్కిన వెంటనే అవుతాయి.
ఇంకొంతమందికి రోడ్డు ఎత్తు పల్లంగా ఉన్నప్పుడు అంటే వెహికల్ అటుఇటు ఊగినపుడు ప్రయాణిస్తున్న బండి వాసన వలన కూడా వాంతులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
ఈ మోషన్ సిక్నెస్ అనేది ఎక్కువగా మహిళల్లోనే కనబడటం కొసమెరుపు.అలాగే 2 నుంచి 12 సంవత్సరాల ఉన్న పిల్లలలో కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎక్కువగా కనబడతాయి.
యెందుకంటే, మహిళలు, పిల్లల్లో సెన్సిటివ్ నెస్ ఎక్కువ కాబట్టి ఆ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.దీనిలో మోషన్ సిక్నెస్, కార్ సిక్నెస్, సీ సిక్ నెస్, ఎయిర్ సిక్ నెస్, వివిధ రకాల పేర్లు ఉంటాయి.

ఇలా ప్రయాణం చేసే సమయంలో తల తిరగడం ఒక్కసారిగా వాంతులు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన చెవిలో “లాబిరింత్స్” అనే భాగం ఉంటుంది.ఈ భాగము పరిశుభ్రంగా లేకపోయినా కూడా ఒకరకమైన వికారానికి లోనై ఇలాంటి ఇబ్బందులు వస్తాయట.ఆ భాగం దెబ్బ తింటే మాత్రమే వాంతులు అవుతాయి అని విద్యులు చెబుతున్నారు.కనుక కొన్ని నెలలకు ఒకేసారి ENT స్పెషలిస్ట్ ని కలిస్తే ఇలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.
కాబట్టి ఇలాంటి సమస్యలు వున్నారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.







