సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతరెడ్డిపేట వద్ద అన్నదాతలు రోడ్డెక్కారు.కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే ధర్నా వద్దకు చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు.రైతులతో పాటు సుమారు రెండు గంటల పాటు ధర్నాలో బైఠాయించారు.
పోతరెడ్డిపేట కొనుగోలు కేంద్రంలో రెండు రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్వాహకులు పూర్తిగా జాప్యం వహిస్తున్నారని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం లో వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.అప్పటి వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు.
సుమారు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు పై వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు సముదాయించిన ఫలితం లేకుండా పోయింది.
రైతులు మాత్రం కొనుగోలు చేసేవరకు ధర్నా ను విరమించేది లేదన్నారు.వెంటనే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హరీష్ ధర్నా ప్రాంతానికి స్థలానికి చేరుకుని రాబోయే ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తామని హామి ఇవ్వడంతో ధర్నా విరమించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే జూన్ పది లోపు ధాన్యం కొనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాం హౌస్ ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు.కుంటి సాకులు చెప్పి రెతన్నలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







