సహజ నటి జయసుధ.అప్పట్లో హీరోయిన్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.
అప్పట్లో ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్టీఆర్ ఏఎన్నార్ నాగేశ్వరావు సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు హవా నడిపించింది.
ఇక ఆ తర్వాత కాలంలో వయస్సు పెరిగిన తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం కాలేదు.ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లిగా కూడా నటిస్తూ వచ్చింది జయసుధ.
ఇక ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు ఆమె తప్ప ఇంకెవ్వరు సూట్ కారూ అనేంతగా తన నటనతో మెప్పించింది.రానురాను నాన్నమ్మ అమ్మమ్మ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే.
ఆ తరువాత రాజకీయాల వైపు అడుగులు వేసిన జయసుధ అక్కడ కూడా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నట్లు గానే కనిపించింది.కాని ఆ తర్వాత కాలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పార్టీలో ఆమెకు సపోర్టు లేకుండా పోయారు.
దీంతో ఇక రాజకీయాల్లో కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి.ఇక మరోవైపు సినిమా అవకాశాలు కూడా తగ్గాయ్.ఇలాంటి సమయంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం.మరి సినిమాలో ఆక్టివ్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ జయసుధ మనసులో మాట బయటపెట్టారు.

జయసుధ మాటలను బట్టి చూస్తే అటు రాజకీయాల్లో కూడా కలిసి రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని జయసుధ భావిస్తున్నారు.అయితే జయసుధ వయసు పెరిగి పోవడంతో ఇక ఇటీవలే సన్నబడి నట్లు కనిపించిన నేపథ్యంలో జయసుధకు ఇప్పుడు దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తారా లేదా అన్నదే ప్రస్తుతం తెరమీదికి వస్తున్న ప్రశ్న.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్థిక కష్టాల తో ఇబ్బంది పడుతున్న జయసుధను ఆదుకునేందుకు ఎవరైనా దర్శకులు ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి.







