పెట్రోల్ బంకు వద్ద ఈ పని జరగట్లేదా? అయితే తక్షణమే కంప్లెయింట్ చేయండి!

తరచూ మీరు పెట్రోల్‌ బంకులకి వెళ్ళవలసి ఉంటుంది.వెళ్ళాక సాధారణంగా ఎవరన్నా ఏం చేస్తారు? బండికి ఆయిల్ కొట్టించి తుర్రున వెళ్లిపోతూ వుంటారు.అయితే కొంతమందికి పెట్రోల్ బంకుకి వెళ్ళాక వేరే అవసరం రావచ్చు.కానీ అది అక్కడ లభ్యమవ్వకపోవచ్చు.అయితే ఇలాంటి సౌకర్యాలు మన దేశంలో వున్న పెట్రోల్ బంకులలో ఖచ్చితంగా ఉండాలి.లేదంటే దీనిపైన సదరు మేనేజ్ మెంట్ పైన పిర్యాదు కూడా చేయొచ్చట.

 Complaint If These Services Are Not Available At Petrol Bunk Details, Petrol Pu-TeluguStop.com

ఇపుడు అవేమిటో తెలుసుకుందాం.

1.

పెట్రోల్‌ బంకుల వద్ద స్వచ్ఛమైన తాగునీరు సదుపాయాన్ని కల్పించాలి.దీనికోసం పెట్రోల్‌ పంప్‌ డీలర్‌ ఆర్‌ఓ మెషిన్‌, వాటర్‌ కూలర్‌, వాటర్‌ కనెక్షన్‌ను ఏర్పాటు చేయాలి.ఒకవేళ ఏ పంపులోనైనా తాగునీటి సౌకర్యాలు లేకపోతే, మీరు “చమురు మార్కెటింగ్‌ సంస్థ”కు ఫిర్యాదు చేయవచ్చు.

2.వాహనదారులు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే ఆ సమయంలో మొబైల్‌ ఫోన్‌ లేకపోతే, సమీపంలో వున్న ఏదైనా పెట్రోల్‌ పంపు దగ్గరకు వెళ్లి, అక్కడనున్న టెలిఫోన్ ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్‌ చేయవచ్చు.ఈ సౌకర్యం పెట్రోల్‌ పంపులలో ఉచితంగా లభిస్తుంది.

3.అన్నింటికంటే ముఖ్యంగా పెట్రోల్‌ పంపుల వద్ద శుభ్రమైన బాత్‌ రూమ్స్‌ సౌకర్యాలు కల్పించాలి.దీన్ని ఉపయోగించడాన్ని ఎవరూ ఆపలేరు.పెట్రోల్‌ పంప్‌ వద్ద మురికి నీరు, సరైన బాత్‌ రూమ్స్‌ లేకుంటే మీరు చమురు కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు.

Telugu Complaint, Complaint Box, Emergency, Toilets, Petrol Bunk, Petrol Pump, P

4.ప్రతి పెట్రోల్‌ పంపు వద్ద ప్రథమ చికిత్స కిట్‌ అనేది తప్పకుండా ఉండాలి.సాధారణ ప్రజలు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు.ప్రథమ చికిత్స కిట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు దాని గురించి రాతపూర్వక ఫిర్యాదు చేయవచ్చు.

5.పెట్రోల్‌, డీజిల్‌ కి సంబంధించి పెట్రోల్‌ పంప్‌ యజమాని లేదా ఏజెంట్‌ మీకు బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు దాని గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

అలాగే టైర్లలో గాలి నింపడానికి అన్ని పెట్రోల్‌ పంపుల వద్ద ఎయిర్‌ మెషీన్‌ తప్పనిసరిగా ఉండాలి.గాలి నింపడానికి ఇక్కడ డబ్బులు వసూలు చేయడానికి లేదు.

Telugu Complaint, Complaint Box, Emergency, Toilets, Petrol Bunk, Petrol Pump, P

6.ప్రతి పెట్రోల్‌ పంపులో ఫిర్యాదు బాక్స్‌ లేదా రిజిస్టర్‌ ఉంచాలి, ఇందులో వినియోగదారులు తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.పెట్రోల్‌ పంప్‌ వద్ద పైన పేర్కొన్న సదుపాయాలు ఏవీ మీకు అందించకపోతే లేదా కల్పించకపోతే మీరు సెంట్రలైజ్డ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ పోర్టల్‌ను సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు.

ఇలాంటి సౌకర్యాలతో పాటు వినియోగదారులకు పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునే హక్కు కూడా ఉంది.

పెట్రోల్‌ పంప్‌ యజమానులు దీనికి ఏర్పాట్లు చేయాలి.అలా చేయకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube