తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితులలో ఉంది.కరోనా తరువాత విడుదల అయిన భారీ సినిమాలు కొన్ని సూపర్ హిట్ అవ్వగా ఇంకొన్ని సినిమాలు మాత్రం దారుణంగా పరాజయం పాలయ్యాయి.
ఇకపోతే ఇంతకుముందు సినిమాలు బాగాలేదు అన్నప్పటికీ కనీసం వారం రోజులపాటు అయినా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది.కానీ ప్రస్తుతం మాత్రం సినిమా బాగోలేదు అని టాక్ వినిపించగానే ఆ హీరోల సొంత అభిమానులు కూడా థియేటర్లకు రావడానికి ఇష్టపడడం లేదు.
ఇందుకు గల కారణం టాలీవుడ్ అగ్ర హీరోల, దర్శకనిర్మాతలకు కక్కుర్తి, వారి దురాశ గానే చెప్పుకోవచ్చు.
ఎందుకంటే సినిమాల బడ్జెట్ ను భారీగా పెంచుకుని, అవసరాలకు మించి ఆడంబరాలకు పోయి మరి ప్రమోషన్స్ ను చేయడం, అలాగే చిన్న సినిమా అయినా కూడా భారీ బడ్జెట్ సినిమాల గా మార్చడం లాంటివి చేసి పెట్టిన ప్రతి పైసా కు ప్రేక్షకుల నుంచి లాగేయాలి అన్న దురాశ ప్రస్తుతం టాలీవుడ్ కీ ఈ పరిస్థితి రావడానికి దారితీసింది అని చెప్పవచ్చు.
అయితే కరోనా ముందు టికెట్ ధర 137 నుంచి 150 వరకు ఉంది.కానీ ప్రస్తుతం టికెట్ ధర 295 నుంచి 400 రూపాయల వరకు ఉంది.
అంతే ఒక సినిమా రెట్టింపు దాదాపుగా రెండున్నర కోట్లకు పెరిగిపోయింది.మరి అంతా భారీగా డబ్బులు పెరిగినప్పుడు ప్రేక్షకులు కూడా సినిమాను ఎందుకు ఆదరిస్తారు.
ఇకపోతే ఈ రోజుల్లో విడుదల అవుతున్న సినిమాలు రెండు మూడు వారాలు లేదా నాలుగు వారాలలో ఓటీటీలో విడుదలవుతున్నాయి.
అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దపెద్ద స్క్రీన్లు టీవీలు వచ్చేశాయి.దీని ద్వారా కూడా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడానికి ఆసక్తిని కనబరచడం లేదు.ఇకపోతే ఇది ఇలా ఉంటే ఇదే విషయాన్ని బాగా స్టడీ చేసిన టాలీవుడ్ హీరో అడివి శేష్ తన సినిమా విడుదల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు.
హీరో అడివి శేష్ తాజాగా నటించిన చిత్రం మేజర్.ఈ సినిమా టికెట్ ధరలు తగ్గించాలి అని దర్శక నిర్మాతలను అదేవిధంగా థియేటర్ల యజమానులను కోరారు అడివి శేష్.
అయితే తన సినిమాకు టికెట్ రేట్లను తగ్గించాను అన్న విషయాన్ని అడవి శేష్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు.అయితే అడవి శేషు తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రేక్షకులకు ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు.
కాబట్టి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మంచి కోరుకునే హీరోలు దర్శకనిర్మాతలు ఎవరైనా సరే టిక్కెట్ ధరలను తక్షణం తగ్గించుకుంటే ఈ దారుణమైన పరిస్థితులు నుంచి బయటపడవచ్చు.లేదంటే ముందు ముందు మరిన్ని దారుణ పరిస్థితులు కావటం ఖాయం.
కాబట్టి టాలీవుడ్ కు ఇప్పుడు మరింత మంది అడవి శేష్ ల అవసరం ఉంది.