తెలుగు టీవీ నటి మైథిలి తాజాగా ఆత్మహత్యాయత్నం చేసింది.ఆమె ఆత్మహత్య చేసుకుంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి మరి ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులకు వీడియో కాల్ చేసిన మైథిలీ పోలీసులు చూస్తుండగానే లైవ్ లోనే పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.అయితే తనకు ఓ కేసు విషయంలో తనకు న్యాయం జరగట్లేదని వాపోతూ మైథిలీ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మైథిలి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.బుల్లితెరపై ప్రసార అవుతున్న పలు సీరియల్స్ లో మైథిలి నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈమె అమీర్‌పేట పరిధిలోని ఎల్లారెడ్డిపేటలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది.కొద్ది నెలల క్రితమే పంజాగుట్ట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.
తాజాగా సోమవారం సాయంత్రం ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరిందట.అంతేకాదు తన భర్త బండి సీజ్ చేయాలని లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని మైథిలి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అయితే మైథిలీ పోలీసులకు వీడియోకాల్ చేసినప్పటికే 8 బ్రీజర్లు, అలాగే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
ఇక పోలీసులకు వీడియో కాల్ చేసి అనంతరం ఫోన్ కట్ చేసిన తర్వాత వెంటనే స్పందించిన పోలీసులు ఇక ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మైథిలి ఇంటికి చేరుకున్నారు.అయితే పోలీసులు ఆమె ఇంటికి వెళ్లేసరికి అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ఇకపోతే ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు సమాచారం.
కాగా గతంలో కూడా మైథిలి మోతె పీఎస్‌లో తన భర్తపై కేసు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.