టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడు కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి .వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వారికి ఇకపై టికెట్ ఇచ్చేది లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు టిడిపి సీనియర్ నాయకులు సీరియస్ గా తీసుకుని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.లోకేష్ కు మొదటి నుంచి సీనియర్ నాయకుల పై సదభిప్రాయం లేదని, వారిని పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు అని, ఇప్పుడు ఈ ప్రతిపాదనను పెట్టడం వెనుక కారణం కూడా అదేనని పార్టీ సీనియర్ నాయకులు మధ్య చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు ఇంకా అనేకమంది సీనియర్ నాయకులు టిడిపిలో యాక్టివ్ రోల్ పోషించారు.అయితే 2004 ఎన్నికల నుంచి చాలా మంది సీనియర్ నాయకులు వరుసగా ఓటమి చెందుతూ వస్తున్నారు.
అటువంటి నాయకులను దృష్టిలో పెట్టుకునే లోకేష్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చి తమను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం సీనియర్ నాయకుల్లో వ్యక్తమవుతోంది.అయితే సీనియర్ నాయకులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో వీరి విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అసలు సీనియర్ నాయకులు లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం సాధ్యమయ్యే పనా ? అనేది కూడా ఇప్పుడు చర్చ కు వస్తోంది.అసలు వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వారిని పక్కన పెట్టాలని లోకేష్ నిర్ణయించుకోవడం.
ఎన్నికల సమయంలో ఇబ్బందులు కలిగించే అవకాశం లేకపోలేదు.

సీనియర్ నాయకుల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు అంతగా ఎదగకపోవడం, ఇప్పటి వరకు సీనియర్ నాయకులు నియోజకవర్గాల్లో చక్రం తిప్పడం , రాబోయే ఎన్నికల్లో తమదే టికెట్ అనే ధీమా తో ఉంటూ వచ్చారు.కానీ ఇప్పుడు లోకేష్ ప్రకటన వారందరికీ ఇబ్బందికరంగా మారింది.లోకేష్ ప్రకటన పై టీడీపీ సీనియర్ లు చంద్ర బాబు పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.







