ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ తో తాడో పేడో అన్నట్టుగా బిజెపి వ్యవహరిస్తోంది.గతంతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ బాగా బలపడింది.
టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహారాలను ఎప్పటికప్పుడు జనాల్లోకి తీసుకు వెళ్తూ రాజకీయం గా సక్సెస్ అవుతున్నారు.టిఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెంచడంలో తెలంగాణ బిజెపి సక్సెస్ అయ్యింది.
ఇదిలా ఉంటే పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న కొన్ని వ్యవహారాలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ గా దృష్టిపెట్టారు. ముఖ్యంగా పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న వారు అవసరమైన సందర్భాల్లో పార్టీ తరపున వాయిస్ వినిపించకుండా సైలెంట్ గా ఉండడం సంజయ్ కు ఆగ్రహం కలిగిస్తోంది.
తెలంగాణ బిజెపి కి తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉన్నారు .తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ తరఫున వాయిస్ వినిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది.నిత్యం మీడియాతో టచ్ లో ఉంటూ అనేక అంశాలపై పార్టీ తరఫున వీరు స్పందించాల్సి ఉంటుంది.కానీ అధికార ప్రతినిధులు అంతా సైలెంట్ గా ఉండి పోవడం … ఏ విషయం పైన తమ స్పందనను తెలియజేయకపోవడం సంజయ్ కు ఆగ్రహం కలిగిస్తోంది .ప్రస్తుతం ఉన్న తొమ్మిది మంది అధికార ప్రతినిధులో ముగ్గురు గతంలోనే నియమితులు కాగా, కొంతకాలం క్రితమే మరో ఆరుగురిని నియమించారు.అయితే వీరు తాము నిర్వర్తించాల్సిన విధులను నిర్లక్ష్యం చేయడం, టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కేంద్రం పైన, బిజెపి కేంద్ర పెద్దలు పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నా అధికార ప్రతినిధులు స్పందించక పోవడం వంటివి సంజయ్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయి.
వీరిలో కొంతమంది పర్వాలేదు అనిపిస్తున్నా … ఎక్కువమంది మాత్రం సైలెంట్ గా ఉండిపోవడంతో ఇటీవలే వారందరిని సమావేశపరిచి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

ఇకపై పార్టీ తరఫున యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలపై స్పందించాలని, సమాచార సేకరణలో నిర్లక్ష్యం వహించి వద్దని, రాజకీయ ప్రత్యర్ధులు చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని , రోజుకో అధికార ప్రతినిధి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని , ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్థానిక నేతల ను అప్రమత్తం చేస్తూ, వారికి తగిన దిశా నిర్దేశం చేయాలని సంజయ్ సీరియస్ గానే హితబోధ చేసినట్లు సమాచారం.







