ఖమ్మం జిల్లా కల్లూరు పట్నంలో మాజీ మంత్రి టిపిసిసి ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు.మా హయాంలో చేసిన సంక్షేమ పథకాలను రచ్చబండ కార్యక్రమంలో గుర్తుచేశారు.
ముఖ్యంగా రైతు డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుకు అన్ని విధాలుగామేలుజరుగుతుందని తెలిపారు.ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి దళితులకు 3 ఎకరాల భూమి మరియు అల్లుడొస్తే డబల్ బెడ్ రూమ్ మరియు పోడు భూముల పట్టాల విషయాల గురించి ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వం అంతా కుటుంబ పాలన ప్రభుత్వం గా మారి ప్రజల పై అనేక భారాలను కలిగిస్తుందని టిఆర్ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







