ఒంగోలులో జరిగిన మహానాడు సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలిచి పోతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహానాడు నిర్వహణకు భూములు ఇచ్చిన మండవవారిపాలెం గ్రామ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
మహానాడుకు ఆర్టీసీ బస్సులు కేటాయించ కుండా ప్రైవేటు వాహనాల నిర్వాహకులను బెదిరించి మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించారని విమర్శించారు.వైసీపీ తాబేదారులు ఇకనైనా బుద్ది తెచ్ఛుకో వాలి.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.వారందరికీ మేము సమాదానం చెప్పవలసిన అవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
ఇప్పటి కైనా జగన్ తీరు మారి మంచి పాలన రాష్ట్రానికి అందించి కక్షపూరిత చర్యలు మానుకోవాలని హితవుపలికారు.టీడీపీ నేతలు ఎప్పుడు అసభ్యంగా మాట్లాడరని.
వారిలో ఎంత బాధ ఉండబట్టే తిట్టారని అన్నారు.వైసీపీ ప్రభుత్వం మారితే తాము కూడా ఆదికారంలోకి వచ్ఛి ముల్లును ముల్లు తోనే తీయాలనే సిద్ధాంతాన్ని టీడీపీ అవలంభిస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం కొత్తగా పెట్టిన పథకం ఒక్కటి లేదని…టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారని.దీనిపై చర్చకు సిద్దమా అని చాలెంజ్ చేశారు.







