సాధారణంగా ఉదయం లేవగానే నిమ్మరసాన్ని తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది.ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు తప్పకుండా మార్నింగ్ రొటీన్ లో నిమ్మరసాన్ని చేర్చుకుంటారు.
గోరు వెచ్చని వాటర్‌లో నిమ్మరసం – తేనె కలిపి లేదా నిమ్మరసం-అల్లం రసం కలిపి తీసుకుంటుంటారు.కానీ, ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో లెమన్ జ్యూస్ ను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి మెత్తగా నూరి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా జ్యూస్, చిటికెడు నల్ల ఉప్పు, వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి బాగా కలిపి సేవించాలి.
ప్రస్తుత వేసవి కాలంలో ఈ విధంగా నిమ్మ రసాన్ని తీసుకుంటే శరీరంలో నీటి స్థాయిలు పడిపోకుండా ఉంటాయి.దాంతో డీహైడ్రేషన్ సమస్యకు దూరంగా ఉండొచ్చు.అలాగే వడదెబ్బ, నీరసం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.నోటి పూత, నోటి దుర్వాసన సమస్యలతో ఇబ్బంది పడేవారు పైన చెప్పిన విధంగా లెమన్ జ్యూస్ ను తీసుకుంటే.
ఆయా సమస్యల నుంచి వేగంగా బయటపడతారు.
నిమ్మరసం, పుదీనా, సబ్జాలో ఉండే పలు సుగుణాలు అధిక వేడిని తొలగించి బాడీని కూల్‌గా మారుస్తాయి.
వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తాయి.అలాగే ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మరసాన్ని పైన చెప్పినట్లు తీసుకుంటే మలబద్ధకం తగ్గుముఖం పడుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం బలంగా మారుతుంది.