రాష్ట్ర స్దాయి ఉత్తమ జర్నలిస్ట్ గా ‘వనం’ ఎంపిక

రాష్ట్ర స్ధాయి ఉత్తమ జర్నలిస్ట్ గా ఖమ్మం జిల్లాకు చెందిన ‘మన తెలంగాణ ’ దినపత్రిక ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ వనం వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు.సీనియర్ జర్నలిస్ట్ ,మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ సభ్యులు ఆర్.

 'vanam' Selected As State Level Best Journalist-TeluguStop.com

సత్యనారాయణ స్ధాపించిన ‘ఆర్ ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ ’ సమాజ హితాన్ని కాంక్షిస్తూ కలాలను పదునెక్కిస్తున్న పాత్రికేయులను ప్రోత్సహించడానికి ,పత్రికల్లో రోజు రోజుకు తగ్గిపోతున్న మానవీయ కథనాలను పెంచడానికి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ కథనాలను ఆహ్వానించి అందులో మానవీయ కథనాలను రాసిన వారిని ఉత్తమ జర్నలిస్ట్ లుగా ఎంపిక చేశారు.కోవిడ్ ఫస్ట్ ,సెకండ్ వేవ్,లాక్ డౌన్ లో రాసిన అత్యుత్తమ కధనాలకు ఈ అవార్డు దక్కింది వనం వెంకటేశ్వర్లు తన జర్నలిజం కేరిర్ లో ఇప్పటికి పలు మార్లు ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపికయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం చే మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు.2003లో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రజాశక్తి దిన పత్రిక వ్యవస్ధాపక సంపాదకులు మోటూరు హన్మంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు.అదేవిధంగా 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చే బి.నాగేశ్వర్ రావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(రూ.2లక్షల క్యాష్ అవార్డు)ను,2008లో రాష్ట్ర ప్రభుత్వం చే ఎం.నర్సింగరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(రూ.1లక్ష క్యాష్ అవార్డు)ను,2012లో విశాఖ పట్టణంలోని ఆర్పిత స్వచ్చంద సేవా సంస్ధ చే ‘ఆంధ్ర రత్న’ అవార్డును,2013 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పర్యటక శాఖ చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు.అదేవిధంగా 2007 లో ‘వార్త’ దిన పత్రిక యాజమాన్యంచే ఖమ్మం జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును,1989లో నల్లగొండ జిల్లాలో ప్రజాపోరు సాయంకాల దినపత్రిక యాజమాన్యంచే బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును,1994లో నల్లగొండలోని గాంధి సేవా సమితి చే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు వార్త దినపత్రికలో ఖమ్మం,హైద్రాబాద్,న్యూఢిల్లీ ,సూర్యాపేటలోపనిచేశారు.

నల్లగొండ లో ఆంధ్రభూమి,ఈనాడు,ప్రజాపోరులో పనిచేశారు .దాదాపు 20 ఏళ్ల పాటు వార్త దిన పత్రికలో ప పనిచేసిన ఆయన ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రికకు ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు.ఇటివలనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టి యు డబ్ల్యు జె ఐజెయు)ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.ఆర్ ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ అవార్డును ఈనెల 30న హైద్రాబాద్ లో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ణాన కేంద్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య,ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా అందుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు)జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి,తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు డా నందిని సిద్దారెడ్డి, ప్రముఖ కవి కసి రెడ్డి వెంకట్ రెడ్డి,టిపిఎస్ సి మెంబర్ కారం రవీందర్ రెడ్డి,తెలంగాణ బేవరేజెస్ మాజీ చైర్మన్ జి దేవిప్రసాద్ రావు,టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొంటారు.ఈ అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్ గా సీనియర్ సంపాదకులు కె రాంచంద్రమూర్తి వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube